Asianet News TeluguAsianet News Telugu

From the IAF Vault: దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న స్క్వాడ్రన్‌ చిహ్నంలోకి కోబ్రా ఎలా వచ్చిందంటే..!

భారత వైమానిక దళంలో ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందిస్తున్న లాంగెస్ట్ సర్వింగ్ స్క్వాడ్రన్ నెంబర్ 3. దీని చిహ్నంలోకి కోబ్రా వచ్చిన కథ ఆసక్తికరంగా ఉన్నది. అది 1942 కాలానికి చెందినది. మిరాన్షాలో 1942లో పుట్టిన ఈ క్రెస్ట్ గురించిన కథను ఐఏఎఫ్ హిస్టోరియన్ అంచిత్ గుప్తా వివరిస్తున్నారు.
 

From the IAF Vault, the story of cobra crest of longest serving squadron
Author
First Published Feb 18, 2023, 10:33 AM IST

భారత వైమానిక దళంలో మధ్యలో బ్రేక్ లేకుండా సేవలు అందిస్తున్న లాంగెస్ట్ సర్వింగ్ స్క్వాడ్రన్ నెంబర్ 3 స్క్వాడ్రన్. దీని చిహ్నంలో ది కోబ్రా ఉంటుంది. ది కోబ్రా నెంబర్ 3 స్క్వాడ్రన్‌ క్రెస్ట్‌లోకి రావడం వెనుక కథ 1942కు చెందినది. 1941 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ స్క్వాడ్రన్ ఫ్లైట్ లెఫ్టినెంట్ హెన్రీ రంగనాథన్ సారథ్యంలో మిరాన్షాలో 1942 తొలినాళ్లలో ఆపరేటింగ్‌లో ఉన్నది. ఉత్తర వజీరిస్తాన్‌లోని మిరాన్షాలో జీవితం కోట గోడలకే పరిమితమై ఉండేది. ఫలితంగా మెస్‌లో ఎన్నో గెట్ టుగెదర్‌లు జరిగేవి.

From the IAF Vault, the story of cobra crest of longest serving squadron Image: Flight Lieutenant Henry Ranganathan

అలాంటి ఓ మాకియవెల్లియన్ సెషన్‌లో ఫ్లైట్ లెఫ్టినెంట్ రంగనాథన్ రెండు డ్రింక్‌లు వేసుకున్న తర్వాత ఆర్మీ లయేసన్ ఆఫీసర్, మేజర్ జాన్ బోర్త్‌విక్‌కు ఆదేశాలు జారీ చేశాడు. చేతిలో బ్యాటన్‌తో మేజర్ జాన్‌ను మోకరిల్లాలని ఆజ్ఞాపించాడు. ‘రంగనాథన్‌ల కోసం కోట్ ఆఫ్ ఆర్మ్స్ రూపొందించాలని నేను ఆదేశిస్తున్నాను’ అని అన్నారు.

మేజర్ బోర్త్‌విక్ అందుకోసం ఒక ఈజిల్, డ్రాయింగ్ బోర్డు, పేపర్, కలర్ చాక్‌లను కోరారు. ఆ కోటలో వాటిని అప్పటికప్పుడు పొందడం కష్టమే. దీంతో ‘ఆ వస్తువులు అందిస్తాం. ఈ సెషన్ రేపు కొనసాగుతుంది’ అంటూ చెప్పాడు. మరుసటి రోజు సాయంత్రం మేజర్ బోర్త్‌విక్ 20 నిమిషాల్లో దాని రెడీ చేశారు.

From the IAF Vault, the story of cobra crest of longest serving squadron

కోట్ ఆఫ్ ఆర్మ్స్ పూర్తిగా ఒక కోబ్రాను తలపించింది. కోట్ ఆఫ్ ఆర్మ్స్ గురించి మేజర్ బోర్త్‌విక్ ఇలా చెప్పారు: ‘రంగనాథన్‌లకు ఇది సరిగ్గా సరిపోయే కోట్ ఆఫ్ ఆర్మ్స్, ఎందుకంటే వారందరూ పాములే(స్నేక్‌లు).’ ఈ డ్రాయింగే ఆ తర్వాత నెంబర్ 3 స్క్వాడ్రన్ క్రెస్ట్ కోసం ఎంచుకున్నారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ రంగనాథన్ ఆ తర్వాత కొద్ది కాలానికి మరణించారు.

ఈ స్క్వాడ్రన్ ఒరిజినల్ లక్ష్యంగా.. ‘బా హిమ్మత్ బా మురద్ (అదృష్టం ధైర్యవంతులనే వరిస్తుంది)’ ఉండేది. 1954లో స్క్వాడ్రన్ కమాండ్ లీడర్ డేవిడ్ యూజీన్ బౌచ్ క్రెస్ట్‌ను యథాతథంగానే ఉంచారు. కానీ, అందులో లక్ష్యం మార్చివేశారు. దాన్ని ‘లక్ష్య వేద్(లక్ష్యాన్ని కచ్చితత్వంతో నాశనం చేయాలి)’గా మార్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios