From the IAF Vault: భారత వైమానిక దళానికి మొదటి చీఫ్‌ను ఎలా ఎంపిక చేశారో తెలుసా? తెరవెనుక ఆసక్తికర పరిణామాలు
భారత వైమానిక దళ చరిత్రకారులు అంచిత్ గుప్తా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి చీఫ్ ఎంపిక ఎలా జరిగిందో వివరిస్తున్నారు. 1947లో జూన్, జులైలో 30 రోజుల వ్యవధిలో ఎలాంటి ట్విస్టులు, ఆసక్తికర పరిణామాల మధ్య ఈ ఎంపిక జరిగిందో రాశారు.

భారత వైమానిక దళానికి మొట్ట మొదటి చీఫ్‌ను ఎలా ఎంపిక చేశారో తెలుసా? దీని వెనుక అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చీఫ్ పోస్టు గురించి ఆలోచన వచ్చినప్పుడు మూడు ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించాల్సి వచ్చింది. ప్రతి సర్వీస్‌కు ఒక చీఫ్ ఉండాలా? లేక ఒకే కమాండర్ ఇన్ చీఫ్ ఉండాలా? ఆ ఆఫీసర్ ర్యాంక్ ఏమై ఉండాలి? ఎవరై ఉండాలి? ఈ మూడు ప్రశ్నలకు సమాధానాల అన్వేషణ ఆసక్తికరంగా సాగింది. వీటన్నింటి గురించి ఏకకాలంలోనే చర్చ జరిగింది. పరిష్కారాలు కనుగొనబడ్డాయి. ఈ ప్రక్రియకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఇండియా ఎయిర్ మార్షల్ హఫ్ వామ్‌స్లీ శ్రీకారం చుట్టారు.
ఇందుకోసం 1947 జులై 1వ తేదీన లూయిస్ మౌంట్‌బాటెన్‌కు వామ్‌స్లీ రికమండేషన్స్ పంపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం నెహ్రూ, జిన్నాల వద్దే ఉన్నది. కానీ, ఈ ప్రక్రియలో మరో కీలక వ్యక్తి ఉన్నారు. ఆయనే అప్పటి ఇండియన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ క్లాడ్ ఆచిన్లెక్.
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ సర్ తామస్ ఎల్మరస్ట్ ఉండాలని జనరల్ ఆచిన్లెక్ అభిలాషించారు. ఆయన నేరుగా మౌంట్‌బాటెన్‌కు రికమెండేషన్స్ పంపారు. ఈ పేరు తన దృష్టికి రాగానే లార్డ్ మౌంట్‌బాటెన్ వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎల్మరస్ట్ పేరును పరిగణనలోకి తీసుకోవాలంటే ఆయన ఇండియాకు కూడా పని చేయాలి. దీంతో ఇది అంతిమంగా ప్రధానమైన విషయంగా మారుతుంది.
Also Read: From the IAF Vault: సీ-87 విమానం ఎవరెస్టు శిఖరం ఎల్లలు దాటింది.. ఎలాగో తెలుసా?
ఎయిర్ మార్షల్ వామ్‌స్లీ సంప్రదింపులను నిర్వహించారు. 1947 జులై 10వ తేదీన ఆయనకు మౌంట్‌బాటెన్ ఓ విషయం తెలిపారు. రాయల్ ఎయిర్ ఫోర్స్‌లోని ఎయిర్ వైస్ మార్షల్ ర్యాంకు అధికారులు తమ వైమానిక దళానికి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఆఫీసర్లుగా ఉండటానికి ఇండియా, పాకిస్తాన్ అంగీకరించాయని వివరించారు. ఇది వామ్‌స్లీకి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఇండియా ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా సుబ్రతో ముఖర్జీనే అవుతారని చాలా మంది అనుకుంటున్నారు.
అన్ని విషయాలు ఆయన ముందు ఉంచుతూ రాయల్ ఎయిర్ ఫోర్స్‌లోని చాలా మంది అధికారులు స్వచ్ఛందంగా ఈ పోస్టులకు సిద్ధంగా లేరని వామ్‌స్లీ తెలిపారు. అంతేకాదు, ఇండియాకు సరిపోయే అధికారి ఎయిర్ వైస్ మార్షల్(ఏవీఎం) పెర్రీ కీన్ అని సూచించారు. ఎందుకంటే ఆయన 1935 నుంచి ఇక్కడ అనేక ర్యాంకుల్లో చేశారని, చాలా మంది అధికారులకు తెలియడమే కాదు.. ఈ దేశంలోనూ ఎక్కువ కాలం గడిపారని పేర్కొన్నారు.
వామ్‌స్లీ ఒత్తిడి మేరకు 1947 జులై 18వ తేదీన మౌంట్‌బాటెన్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ముఖర్జీ ఆలోచనలతో ఆయన కూడా షాక్ అయ్యారు. ముఖర్జీ తన కంటే సేవలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చే అధికారులకు తన మద్దతు ప్రకటించారు. రెండు మూడు సంవత్సరాల్లో తాను చీఫ్ అవుతాననే నమ్మకం ఆయనకు ఉన్నది. మౌంట్‌బాటెన్, వామ్‌స్లీ, పెర్రీ కీన్‌లతో ముఖర్జీ కూడా ఒకే తాటి మీదకు వచ్చారు. 1947 జులై 22న భారత వైమానిక దళానికి చీఫ్‌ను ప్రకటించి ఉండాల్సిందే. కానీ, అప్పుడు మరో ట్విస్ట్ వచ్చింది.
జులై 21వ తేదీన భారత వైమానిక దళానికి చీఫ్‌గా ఎల్మరస్ట్‌ను పరిగణించాలని మౌంట్‌బాటెన్‌కు నెహ్రూ లేఖ రాశారు. నెహ్రూతోపాటు డిఫెన్స్ మినిస్టర్ కూడా ఇదే ఒపీనియన్ చెప్పారు. నెహ్రూకు సన్నిహితంగా ఉండే ఆచిన్లెక్ వీరిని ప్రభావితం చేసి ఉండొచ్చు.
Also Read: 26 రోజుల్లో రన్‌వే నిర్మించి లడాఖ్‌ను కాపాడిన ఇంజినీర్.. సోనమ్ నోర్బు విజయగాధ
1947 జులై 23న నెహ్రూ, ఎల్మరస్ట్‌ల మధ్య మౌంట్‌బాటెన్ ఓ సమావేశాన్ని నిర్ణయించారు. తద్వార ఆ పోస్టుకు ఎల్మరస్ట్‌ను నెహ్రూ ఒప్పించవచ్చు అని భావించారు. దీంతో భారత వైమానిక దళానికి చీఫ్.. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ వైస్ మార్షల్ కాకుండా ఎయిర్ మార్షల్‌లే వచ్చారు.
జులై 26న ఎల్మరస్ట్‌ను నెహ్రూ ఒప్పించగలిగారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చీఫ్‌గా ఎయిర్ మార్షల్ ఎల్మరస్ట్ ఫిక్స్ అయ్యారు. ఆర్మీతోపాట ఎయిర్ ఫోర్స్‌కు కూడా ఎయిర్ మార్షల్ చీఫ్‌గా ఉండాలనే ముఖర్జీ ఆలోచన నిజమైంది. ఏడేళ్ల తర్వాత ముఖర్జీ ఎయిర్ మార్షల్‌గా ఐఏఎఫ్‌కు చీఫ్ అయ్యారు.
దీనికి సమాంతరంగానే మౌంట్‌బాటెన్, జిన్నాల మధ్య సంప్రదింపులు జరిగాయి. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ వైస్ మార్షల్ అయిన పెర్రీ కీన్ పాకిస్తాన్ ఆర్మీ ఫోర్స్‌కు చీఫ్ అయ్యారు. 1947 జులై 27న ప్రకటనలు వెలువరించారు. భారత వైమానిక దళానికి తొలి చీఫ్‌గా ఎయిర్ మార్షల్ ఎల్మరస్ట్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తొలి చీఫ్‌గా ఎయిర్ వైస్ మార్షల్ పెర్రీ కీన్ అయ్యారు.
-- (అంచిత్ గుప్తా మిలిటరీ కుటుంబంలో జన్మించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే భారత వాయు సేన చరిత్రను పలు వేదికలపై పంచుకుంటుంటారు.)