ఊబకాయం, బాణ పొట్ట ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఇది పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతుంది. కొవ్వు పేరుకుపోతే గుండె జబ్బు సహా చాలా ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ఒక్కసారి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే తగ్గించడం చాలా కష్టం. ఈ సమస్య రాకుండా ఉండాలంటే వ్యాయామం ఎంత ముఖ్యమో, తినే ఆహారం కూడా అంతే ముఖ్యం. కఠినమైన డైట్ లేకుండా, కొవ్వును కరిగించే ఆహారాలను మీ డైట్లో చేర్చుకుంటే సహజంగానే బరువు తగ్గుతారు.