Belly Fat: నిమ్మరసంలో ఇదొక్కటి కలిపి తాగితే, బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది..!
నిమ్మరసం లో కొన్నింటిని కలిపి తీసుకుంటే..కచ్చితంగా బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.

belly fat
ఈ మధ్యకాలంలో అధిక బరువుతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. కొన్ని రకాల డైట్ లు ఫాలో అయితే బరువు అయినా తగ్గుతామేమో కానీ,బెల్లీ ఫ్యాట్ మాత్రం తొందరగా కరగదు. దాని కోసం కఠిన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని చేసినా కూడా కొందరికి పెద్దగా ఫలితం రాదు. కానీ.. నిమ్మరసం తీసుకోవడం వల్ల ఈజీగా ఆ బెల్లీ ఫ్యాట్ ని కరిగించొచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
నిమ్మరసం ప్రయోజనాలు...
నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, కరికే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడానికి, శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపడంలోనూ సహాయపడతాయి. ఈ నిమ్మరసంలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మంచి హైడ్రేషన్ ని అందిస్తుంది. దీనిలోని ఆల్కలీన్ లక్షణాలు జీర్ణవ్యవస్థలో కొద్ది ఆల్కలీన్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఈ నిమ్మరసం లో కొన్నింటిని కలిపి తీసుకుంటే..కచ్చితంగా బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.
1.చియా సీడ్స్..
చిన్నగా ఉండే ఈ గింజలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా కీలకంగా పని చేస్తాయి. ఈ గింజల్లో ప్రోటీన్ తో పాటు, ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ని రాత్రిపూట చల్లటి నీటిలో నానపెట్టి.. ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలోని ఫైబర్ మిమ్మల్ని కడుపు నిండినట్లు చేస్తుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది.
ఈ విత్తనాలను నిమ్మరసం నుండి విటమిన్ సితో కలిపినప్పుడు, శరీరం పోషకాలను బాగా గ్రహిస్తుంది. ఈ విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, వివిధ ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి మంచివి. బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
పచ్చి పసుపు..
నిమ్మరసం నీటిలో పచ్చి పసుపు కలిపి తీసుకోవడం వల్ల కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు. పసుపులోని కర్కుమిన్ శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఊబకాయం వల్ల కలిగే తీవ్రమైన మంటను తగ్గిస్తుంది. నడుము ప్రాంతంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా నల్ల మిరియాలు , నిమ్మరసం కలిపిన పసుపును తీసుకోవడం వల్ల శరీరంలో నీటి నిలుపుదల తగ్గుతుంది, జీవరసాయన ప్రతిచర్యలు వేగవంతం అవుతాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ని కరిగిస్తుంది.
పచ్చి అల్లం..
ప్రతిరోజూ నిమ్మరసంలో పచ్చి అల్లం దంచి..దాని రసాన్ని కూడా కలిపి తీసుకోవాలి. ఇందులో గోరువెచ్చని నీరు కూడా కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తాగాలి. ఇలా తాగడం వల్ల మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఈజీగా బరువు తగ్గించడంలో, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో హెల్ప్ చేస్తాయి.
మీరు ఈ పానీయాలను ఎప్పుడు తాగాలి?
అల్లం రసం, చియా సీడ్స్, పచ్చి పసుపు, నిమ్మరసం అన్ని కలిపి తీసుకున్నా కూడా మంచి ఫలితం వస్తుంది. ఉదయాన్నే తీసుకుంటే ఫలితాలు బాగుంటాయి. రెగ్యులర్ గా తీసుకుంటే..బరువు,బెల్లీ ఫ్యాట్ లో తేడాలు క్లియర్ గా కనిపిస్తాయి.