Atmakur assembly elections result 2024 : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో హేమాహేమీ రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఆత్మకూరు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే కాదు కేంద్ర మంత్రిగా, యూపీ గవర్నర్ గా పనిచేసిన బెజవాడ గోపాల్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా పనిచేసారు. ఆయన తర్వాత కూడా మరికొందరు రాజకీయ ప్రముఖులు ఆత్మకూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నత పదవులు పొందారు. ఇక ప్రస్తుతం ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డి కొనసాగుతున్నారు. మరి ఈసారి ఆత్మకూరు అసెంబ్లీలో గెలుపెవరిదన్న ఉత్కంఠ నెలకొంది.
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోయినా కుట్రలు మాత్రం ఆగలేదని మంత్రి మండిపడ్డారు.
నెల్లూరు: వైసిపి ఎమ్మెల్యే మేకపాట గౌతమ్ రెడ్డి మృతితో ఖాళీఅయిన ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో వైసీపీ భారీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సొంతం చేసుకున్నారు.
Atmakur by-election: ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పలు చోట్ల సాయంత్రం 6 గంటలకు క్యూలో నిలబడిన వారిని ఓటు వేసేందుకు పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా అనుమతించారు.
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 14 మంది బరిలో వున్నారని.. 6 గంటల వరకు క్యూలైన్లో వున్న వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తామని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు నిలిచారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికకు మంగళవారంతో ప్రచార గడువు ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. 2,13,338 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు
మేకపాటి గౌతంరెడ్డి మృతిలో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపఎన్నికకు బరిలో 14 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహిస్తున్న ఉప ఎన్నికకు సోమవారం ( మే 30) నోటిఫికేషన్ విడుదలైంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి జూన్ 23న పోలింగ్ జరపనుంది. నోటిఫికేషన్ వెలువడిన రోజే.. రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి.