చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలికిరి మండలం కొట్టాల గ్రామంలో అభం శుభం తెలియని ఓ పదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. 

పాఠశాలకు వెళుతున్న బాలికకు మాయమాటలు చెప్పి వీరద్రయ్య(25) అనే యువకుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక అసహాతను ఆసరాగా చేసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

read more  ప్రేమ పెళ్లి.. మోజు తీరాక.. మరో యువతితో..

అయితే తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బంధువుల సాయంతో వారు నిందితుడు భద్రయ్యను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. 

పోలీసులు కూడా అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడిని నిందితున్ని చితకబాదారు. పోలీసుల నుండి తప్పించుకోడానికి ప్రయత్నించడంతో మరింత ఆగ్రహించిన వారు చితకబాదారు.

read more  కొమరం భీమ్ జిల్లాలో మహిళపై గ్యాంగ్‌రేప్, హత్య

చిన్నారి బాలికపై అఘాయిత్యానికి పాల్పడినందుకు అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ నిందితున్ని వెంటనే ఉరితీయాలంటూ ప్రజా సంఘాలు, పాఠశాల విద్యార్థులు డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.