- Home
- Districts News
- Tirupati
- Tirumala Darshan Tips : తిరుమలకు వెళ్తున్నారా? ఫ్రీ దర్శనం టోకెన్లు ఎక్కడ, ఎలా తీసుకోవాలో తెలుసా? ఏ టు జెడ్ గైడ్
Tirumala Darshan Tips : తిరుమలకు వెళ్తున్నారా? ఫ్రీ దర్శనం టోకెన్లు ఎక్కడ, ఎలా తీసుకోవాలో తెలుసా? ఏ టు జెడ్ గైడ్
తిరుమల శ్రీవారి ఫ్రీ దర్శనం టోకెన్ దొరకలేదా? ముందుగా టికెట్ బుక్ చేసుకోలేదా? అయితే ఫ్రీ ఎస్ఎస్డీ టోకెన్లు ఎక్కడ ఇస్తారు, ఎలా తీసుకోవాలి? శ్రీవారి ఉచిత సర్వదర్శనం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

తిరుమలలో ఫ్రీ దర్శనం టోకెన్లు ఎక్కడ, ఎలా తీసుకోవాలి?
కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని కోట్లాదిమంది భక్తులు కోరుకుంటారు. అయితే చాలామంది ముందుకు దర్శన టికెట్లను పొందాక తిరుమలకు వెళుతుంటారు. కానీ కొందరు ఎలాంటి టికెట్ లేకుండానే సడెన్‌గా తిరుపతి వెళుతుంటారు. ఇలాంటివారికి ప్రయాణం మొదలుపెట్టాక ఫ్రీ దర్శనం టికెట్ ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని గంటలకు ఇస్తారు, ఎంతసేపు వెయిట్ చేయాలి అనే డౌట్స్ వస్తుంటాయి.వీరి కోసమే టీటీడీ (TTD) అందిస్తున్న ఉచిత సర్వదర్శనం, టోకెన్లు తీసుకునే విధానం గురించి పూర్తి సమాచారం అందిస్తున్నాం.
ఉచిత దర్శనం టికెట్ అంటే ఏంటి?
తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలంటే వివిధ రకాల టికెట్లు ఉంటాయి… ఇందులో డబ్బులు కట్టకుండా ఉచితంగానే శ్రీవారిని దర్శించుకునే విధానాన్ని సర్వదర్శనం అంటారు. ఇందులో ఒక నిర్దిష్ట సమయంలో క్యూలైన్లోకి వెళ్లేందుకు ఇచ్చే ఫ్రీ టోకెన్‌ను స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్ అంటారు. ఈ టోకెన్లు లిమిటెడ్‌గా ఇస్తారు కాబట్టి, వెళ్లిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా దొరుకుతాయని చెప్పలేం. ఎవరు ముందుగా వెళితే వారికే ఈ టికెట్లు లభిస్తాయి.
ఫ్రీ టోకెన్లు ఎక్కడ ఇస్తారు?
తిరుపతికి నేరుగా వెళ్లే భక్తులు టీటీడీ ప్రకటనల ప్రకారం ఈ కింది కేంద్రాల్లో ఎస్ఎస్డీ (SSD) టోకెన్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. తిరుపతి బస్టాండ్ దగ్గరున్న శ్రీనివాసం, రైల్వే స్టేషన్ దగ్గరున్న విష్ణు నివాసంతో పాటు తిరుమల అలిపిరి దగ్గరున్న భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టోకెన్లు ఇస్తారు. అయితే మీరు ప్రయాణం పెట్టుకునే ముందు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో టోకెన్ల లభ్యత, ఇచ్చే సమయం, కౌంటర్ల వివరాలను ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది.
టికెట్ కోసం ఏం చేయాలి?
స్టెప్ 1 : తిరుపతికి వెళ్లే ముందు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ చూడండి.
స్టెప్ 2 : ఎస్ఎస్డీ టోకెన్లు ఇచ్చే కేంద్రాలు, ఆ రోజు టోకెన్ల లభ్యత గురించి తెలుసుకోండి.
స్టెప్ 3 : టోకెన్లు ఇచ్చే కౌంటర్‌కు నేరుగా వెళ్లి, అక్కడి సిబ్బంది చెప్పే రూల్స్ ఫాలో అవ్వండి.
స్టెప్ 4 : టోకెన్ దొరికితే, అందులో ఉన్న దర్శనం టైమ్, రూల్స్ జాగ్రత్తగా చదవండి.
స్టెప్ 5 : టోకెన్‌లో ఇచ్చిన టైమ్‌కే క్యూలైన్‌కు వెళ్లండి. ముందుగా వెళ్లినా, లేట్‌గా వెళ్లినా దర్శనానికి అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది.
అఫీషియల్ వెబ్సైట్: https://www.tirumala.org/
ఆన్లైన్ సేవలు: https://ttdevasthanams.ap.gov.in
ఫ్రీ టికెట్ దొరకకపోతే ఏం చేయాలి?
ఒకవేళ మీకు ఎస్ఎస్డీ టోకెన్లు దొరకకపోతే, టోకెన్ లేని సర్వదర్శనం క్యూలైన్లో భక్తులను అనుమతిస్తున్నారో లేదో టీటీడీ ప్రకటనల్లో చెక్ చేయండి. ఈ పద్ధతిలో వెయిటింగ్ టైమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 2026 అక్టోబర్ 14న టీటీడీ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఎస్ఎస్డీ టోకెన్ లేని సర్వదర్శనానికి సుమారు 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. ఇది ఆ రోజు పరిస్థితి మాత్రమే. రద్దీని బట్టి వెయిటింగ్ టైమ్ మారుతూ ఉంటుంది.
ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు
ఉచిత ఎస్ఎస్డీ టోకెన్లకు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇవి లిమిటెడ్‌గా ఇస్తారు కాబట్టి ముందుగా వెళ్లినా దొరుకుతాయన్న గ్యారెంటీ లేదు. టోకెన్ల కోసం దళారులకు డబ్బులు ఇవ్వకండి. ఆధార్ లాంటి ఐడీ కార్డును కచ్చితంగా తీసుకెళ్లండి. ఏ డాక్యుమెంట్లు కావాలో ఆ రోజు అఫీషియల్ ప్రకటనలో చెక్ చేసుకోండి.
చిన్నపిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోండి. టోకెన్లు ఉన్నాయో లేదో కన్ఫర్మ్ చేసుకోకుండా ప్రయాణ ఖర్చులు పెట్టుకోవద్దు. అఫీషియల్ అప్డేట్స్ చూసి ప్లాన్ చేసుకుంటే అనవసరమైన టెన్షన్, ఇబ్బందులు తప్పుతాయి.

