ఆదిలాబాద్: కొమరం భీమ్ జిల్లాలో ఓ మహిళపై గ్యాంగ్‌ రేప్ కు గురైంది. బాధితురాలిని హత్య చేశారు. చెట్ల పొదల్లో మహిళ మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ మండలానికి చెందిన టేకు లక్ష్మిగా మృతురాలిని పోలీసులు గుర్తించారు.టేకు లక్ష్మి బెలూన్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ మండలానికి చెందిన టేకు లక్ష్మిగా మృతురాలిని పోలీసులు గుర్తించారు.టేకు లక్ష్మి బెలూన్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది.

అయితే లింగాపూర్ మండలంలో బెలూన్లు విక్రయించేందుకు వచ్చి ఆమె హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Also read:ప్రియుడితో రాసలీలల్లో భార్య, పక్క గదిలోనే మరో జంట: షాకైన భర్త

సోమవారం నాడు ఉదయం లింగాపూర్ గ్రామస్తులు  లక్ష్మి మృతదేహాన్ని గుర్తించారు. అత్యాచారం చేసి లక్ష్మిని హత్య చేయడంతో  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగాపూర్  మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు  ఓ ద్విచక్ర వాహనాన్ని దగ్గం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే  పోలీసులు ఆసిఫాబాద్ నుండి వచ్చారు.ఆందోళనకారులను పోలీసులు శాంతింపజేశారు. లక్ష్మిని  హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని  స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

నిత్యం సంచారం చేస్తూ పొట్టపోసుకొంటారు లక్ష్మి కుటుంబసభ్యులు. లక్ష్మి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.మృతురాలి కుటుంబానాన్ని ఆదుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.