వివాహేతర సంబంధం: మహిళను స్తంభానికి కట్టేసి కొట్టారు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 13, Aug 2018, 12:50 PM IST
woman attacked by wife's relatives for extra marital affair in nalgonda district
Highlights

తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకొందని ఆరోపిస్తూ  ఓ మహిళను  భార్యతో పాటు  ఆమె బంధువులు  చితకబాదారు. దీంతో బాధితురాలు  అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది


తిరుమలగిరి: తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకొందని ఆరోపిస్తూ  ఓ మహిళను  భార్యతో పాటు  ఆమె బంధువులు  చితకబాదారు. దీంతో బాధితురాలు  అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది.  ఈ ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరిలో చోటు చేసుకొంది. 

నల్గొండ జిల్లా తిరుమలగిరి  మండలం సాగర్ మండలం అల్వాల్ లో తన భర్తతో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని  అనుమానంతో  రేణుక, తన బంధువులతో కలిసి  బాధితురాలిని  స్థంభానికి కట్టేసి చితకబాదింది.

ఇవాళ తెల్లవారుజామున  బాధితురాలు ఇంటికి వచ్చిన  నిందితులు  ఆమెను స్థంభానికి కట్టేసి చితకబాదారు.  ఈ దాడులతో  బాధితురాలు స్పృహా కోల్పోయింది.  ఈ విషయం తెలుసుకొన్న గ్రామస్థులు బాధితురాలిని విడిపించారు.  

స్థానికులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఈ సమాచారం మేరకు  పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొన్నారు.  దీంతో నిందితులు పారిపోయారు.  బాధితురాలిని  చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై  బాధితురాలి ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు చదవండి

అందంగా ఉన్నావు.. నువ్వంటే నాకిష్టం.. : ఎస్ఐ లైంగిక వేధింపులు

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి

వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తకు షాకిచ్చిన భార్య

ట్విస్ట్: అందమైన భార్యను చూస్తున్నారని భర్త చేసిన పనికి షాకైన వైఫ్

 

loader