కర్నూల్: రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి రక్షణ కల్పించకుండా ఓ మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు.  ఈ ఘటనపై  పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై  ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఎస్ఐ‌ను  వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.

కర్నూల్ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళను ఆత్మకూరు ఎస్సై  వెంకటసుబ్బయ్య లైంగిక వేధింపులకు గురిచేశాడు.  బాధితురాలికి అర్థరాత్రి పూట పలుమార్లు ఫోన్ చేసి వేధింపులకు గురి చేశాడు.

ఈ విషయమై బాధితురాలు  అన్ని ఆధారాలతో సహా  జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.   బాధితురాలు భర్త, పిల్లలతో కలిసి  ఫిర్యాదు చేసింది.  తనకు ఎస్ఐ ఏ సమయంలో ఏ ఏ ఫోన్ నెంబర్లతో ఫోన్ చేసి వేధింపులకు గురిచేశాడనే విషయాలపై  జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టికి బాధితురాలు వివరించింది.

బాధితురాలు ఫిర్యాదు మేరకు  ఎస్ఐ ను  వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఈ ఘటనపై  విచారణ జరిపి నివేదికను ఇవ్వాలని అదనపు ఎస్పీ మాధవరెడ్డిని ఆదేశించారు.

ఈ వార్తలు చదవండి:

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి

వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తకు షాకిచ్చిన భార్య

ట్విస్ట్: అందమైన భార్యను చూస్తున్నారని భర్త చేసిన పనికి షాకైన వైఫ్