న్యూఢిల్లీ: అందంగా  ఉండడమే ఆమె చేసిన పాపం..  తన భార్య అందంగా ఉందని  భావించి ఆమెను హత్య చేయాలనుకొన్నాడు ఓ దుర్మార్గుడు.  అయితే  హత్య చేస్తే  జైలుకు వెళ్లాల్సి వస్తోందని భావించాడు.  అయితే  ఆమెను  వ్యభిచార గృహనికి అమ్మితే  భార్య బెడద తప్పడమే కాదు  డబ్బులు కూడ వస్తాయని భావించాడు. అయితే  నిందితుడు సద్దాం ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులకు చిక్కి ప్రస్తుతం జైలు ఊచలను లెక్కిస్తున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకొంది.

న్యూఢిల్లీలో నివాసం ఉండే సద్దాంకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. తన భార్య అందంగా ఉంటుంది.ఆమె అందంగా ఉండడమే  ఆమెకు శాపంగా మారింది. భార్య, భర్తలు బయటకు వెళ్లిన సమయంలో  ఆమెను ఇతరులు చూసేవారు.  దీంతో సద్దాం వారితో గొడవకు దిగేవాడు.

ఇంటి నుండి బయటకు వెళ్తే అనుమానంతో  సద్దాం గొడవకు దిగేవాడు. ప్రతి రోజూ ఏదో రకమైన గొడవ జరిగేది.దీంతో  అందంగా ఉన్న  తన భార్య వల్లే ప్రతి రోజూ తాను గొడవకు దిగాల్సి వస్తోందని భావించాడు.

దీంతో ఆమెను హత్య చేయాలని భావించాడు. అయితే హత్య చేస్తే  పోలీసులకు చిక్కుతానని భావించాడు.ఈ విషయమై ప్లాన్ మార్చుకొన్నాడు.  వ్యభిచారగృహనికి అమ్మితే తనకు ఎలాంటి గొడవ ఉండదని  భావించాడు.

దీంతో ఓ వ్యభిచారగృహనికి విక్రయించేందుకు ప్లాన్ చేశాడు. అయితే వ్యభిచారగృహనికి అమ్మాయిలను విక్రయించే బ్రోకర్‌గా భావించి ఓ వ్యక్తితో సద్దాం బేరసారాలు మొదలు పెట్టాడు. అయితే తన భార్యను పుట్టింటికి తీసుకెళ్తానని నమ్మించి ఇంటి నుండి తీసుకొచ్చాడు. వ్యభిచారగృహనికి అమ్మాయిలను విక్రయించే బ్రోకర్ గా భావించిన వ్యక్తిని తన భార్యను అప్పగించాడు.

అయితే ఇక్కడే సద్దాం తప్పటడుగు వేశాడు. తాను ఎవరైతే  వ్యభిచార బ్రోకర్‌గా భావించాడో.. అతను మఫ్టీలో ఉన్న పోలీసు.. సద్దాం భార్యను అప్పగించగానే మఫ్టీలో ఉన్న పోలీసు సద్దాంను అరెస్ట్ చేశాడు. సద్దాం భార్య ఈ విషయం తెలిసి షాక్‌కు గురైంది.

ఈ వార్త చదవండి

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు