Asianet News TeluguAsianet News Telugu

కొడుకు మాటలు నమ్మి.. క్షణికావేశంలో కత్తితో పొడిచి భర్తను చంపేసి..

డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఈ నెల 5న గుంటూరుకు వెళ్లిన మౌనిక.. 6వ తేదీ ఇంటికి చేరుకుంది. ఆమె ఇంట్లో లేని సమయంలో స్థానికంగా చెడుగా ప్రచారం చేశాడంటూ father మురళీధర్ రెడ్డి మీద son తల్లికి ఫిర్యాదు చేశాడు.

wife murders husband over family disputes in saroornagar, hyderabad
Author
Hyderabad, First Published Nov 9, 2021, 10:17 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సరూర్ నగర్ : చిన్నపాటి విషయమై ఆ దంపతుల మధ్య వివాదం తలెత్తింది. ఆ తరువాత మాటా మాటా పెరగడంతో విచక్షన కోల్పోయిన భార్య ఏకంగా భర్తను కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటన hyderabad సరూర్ నర్ ఠాణా పరిధిలో సోమవారం జరిగింది. 

ఇన్ స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, బుసిరెడ్డిగూడ గ్రామానికి చెందిన బుసిరెడ్డి మురళీధర్ రెడ్డి  (42), మౌనిక (25) దంపతులు 11 యేళ్ల క్రితం నగరానికి వచ్చి సరూర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇద్దరూ వేర్వేరుగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. 

డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఈ నెల 5న గుంటూరుకు వెళ్లిన మౌనిక.. 6వ తేదీ ఇంటికి చేరుకుంది. ఆమె ఇంట్లో లేని సమయంలో స్థానికంగా చెడుగా ప్రచారం చేశాడంటూ father మురళీధర్ రెడ్డి మీద son తల్లికి ఫిర్యాదు చేశాడు.

కొడుకు మాటలు గుడ్డిగా నమ్మిన మౌనిక.. ముందూ, వెనకా ఆలోచించలేదు.. చాలా కోపానికి వచ్చింది.  కోపోద్రిక్తురాలైన ఆమె భర్తను నిలదీయడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

హైదరాబాదులో డ్యాన్సర్ అనుమానాస్పద మృతి: నగ్నంగా శవం, రేప్ అనుమానం

ఈ సమయంలో సహనం కోల్పోయిన మౌనిక.. ఇంట్లో ఉన్న Vegetable knifeతో భర్త మెడమీద పొడిచి murder చేసింది. అనంతరం స్థానిక ఠాణాకు వచ్చి లొంగిపోయింది. 

టవల్ ఇవ్వలేదని...
చిన్న చిన్న విషయాలకే భార్యభర్తల మధ్య గొడవలు రావడం మామూలు. అయితే ఆ గొడవలు కాసేపటికి సద్దుమణుగుతాయి. మామూలుగా అయిపోతారు. కానీ చిన్న విషయానికే పట్టరాని కోపంతో భార్యనే హత్య చేశాడో భర్త. తాను అడిగినప్పుడు ఇవ్వలేదని.. తనకు సేవలు చేయలేదన్న ఈగోతో భార్యను అంతమొందించాడు. 

హత్యకు అసలు కారణం వింటే ఆశ్చర్యంతో పాటు.. ఇంత చిన్న వాటికి చంపుకుంటూ పోతే సమాజంలో నేరాల రేటు ఏ రీతిన పెరుగుతుందన్న భయమూ కలుగుతుంది. అసలేం జరిగిందంటే...

అడిగిన వెంటనే తువ్వాలు ఇవ్వలేదన్న కోపంతో భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త.  మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లా హీరాపూర్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.  

మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి భార్యకు రూ.11కోట్ల టోకరా.. ఇద్దరు అరెస్ట్..!

నిందితుడు అటవీ శాఖలో తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్న రాజకుమార్ బాహేగా పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం స్నానం ముగించుకున్న రాజకుమార్… భార్య పుష్ప బాయ్ (45)ను Towel అడిగాడు. ప్రస్తుతం తాను పనిలో ఉన్నానని కాసేపు ఆగాలి అని ఆమె చెప్పింది.  

కొన్ని నిముషాల తర్వాత husbandకి టవల్ అందించింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న రాజ్ కుమార్ అక్కడే ఉన్న పారతో భార్య తలపై attack చేశాడు. అడ్డువచ్చిన కుమార్తెను బెదిరించాడు. దాడిలో తీవ్రంగా Injured పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios