Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదులో డ్యాన్సర్ ది హత్యే: రేప్ అనుమానాలను కొట్టిపారేసిన పోలీసులు

హైదరాబాదులోని ఫలక్ నుమాలో ఓ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. డ్యాన్సర్ ఫాతిమా మృతదేహం నగ్నం పడి ఉంది. ఆమె శవం పక్కన బీర్ బాటిల్ కనిపించింది. దీంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Dancer dead in mysterious condition in Hyderabad
Author
Falaknuma, First Published Nov 9, 2021, 9:49 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణ సంఘటన జరిగింది. డ్యాన్సర్ ఫాతిమా మృతదేహం వీధిలో నగ్నంగా పడి ఉందంటూ తొలుత వార్తలు వచ్చాయి. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. డ్యాన్సర్ మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.డ్యాన్సర్ Fatima భర్త ఏడాది క్రితం మరణించాడు. ఆమెకు పిల్లలున్నారు. వారిని తానే పోషిస్తూ వస్తోంది. ఆమె మృతదేహం హైదరాబాదులోని Falaknumaలో ఇంటికి సమీపంలోనే పడి ఉంది. ఆమెపై ఎవరైనా అత్యాచారం చేసి చంపేశారా, కొంత మంది దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి చంపేశారా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే, డ్యాన్సర్ మీద అత్యాాచారం జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని పోలీసులు చెప్పారు. అదే విధంగా అర్థనగ్నంగా మృతదేహం పడి ఉందనేది కూడా నిజం కాదని అన్నారు. డ్యాన్సర్ గొంతుపై గాయాలున్నాయని చెప్పారు. ఇటీవలే ఆమె పూల్ బాగ్ నుంచి ముస్తఫానగర్ కు మకాం మార్చినట్లు చెప్పారు.చున్నీ చుట్టి గొంతుకు బిగించినట్లు ఉందని చెప్పారు. ఐపీసీ 302 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సాయంత్రంలోగా నిందితుడిని పట్టుకుంటామని అన్నారు. ఫాతిమాది హత్యేనని నిర్ధారించారు.

మూడు రోజుల క్రితమే ఆమె ముస్తఫానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఆదివారం వస్తువులను షిఫ్ట్ చేసేందుకు పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచింది. ఆమె కొత్త ఇంటికి వచ్చి తిరిగి రాకపోవడంతో తల్లి వచ్చి చూసింది. ఆమె అప్పటికే మరణించి కనిపించింది. ఆమె గొంతుపై గాయాలు కనిపించాయి. ఫాతిమా మృతదేహం పక్కన బీర్ బాటిల్ కనిపించింది. దీంతో ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దానిపై ఫాతిమా సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతకు ముందు తండ్రి, తాజాగా తల్లి మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు. ఫాతిమా మరణానికి కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also Read: హైదరాబాద్ లో దారుణం.. పదేళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి.. దేహశుద్ది..

హైదరాబాదులోని పంజగుట్టలో ఇటీవలే ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. దీపావళి పండుగనాడు ఓ చిన్నారి మృతదేహం కనిపించింది. మూసి ఉన్న దుకాణం ఎదురగా ఆమె శవం పడి ఉంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారిది హత్యేనని తేల్చారు. కడుపులో బలంగా తన్నడం వల్ల బాలిక మరణించినట్లు పోలీసులు తేల్చారు. బాలిక మరణించిన తర్వాత ఆమె శవాన్ని ఓ మహిళ తీసుకుని వచ్చి దుకాణం ముందు పడేసినట్లు గుర్తించారు. ఆ మహిళను గుర్తించడానికి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

చిన్నారిని హత్య చేసిన దుండగులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వేరే చోట హత్య చేసి బాలిక శవాన్ని దుకాణం ముందు పడేశారని పోలీసులు గుర్తించారు. బాలికపై అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని పోలీసులు చెప్పారు. మృతదేహంపై గాయాలు ఉండడం వల్ల హత్య చేసినట్లు భావిస్తున్నట్లు వారన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios