భర్తను ఫంక్షను పంపించి, తొందరగా రమ్మని చెప్పిన భార్య.. అతను వచ్చేసరికి కనిపించకుండా పోయింది. దీంతో స్నేహితుడి మీద అనుమానం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడా భర్త.. 

హైదరాబాద్ : భర్త ఫంక్షన్కు వెళ్లి వచ్చేసరికి ఓ భార్య అదృశ్యమైన ఘటన హైదరాబాదులో కలకలం రేపింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ దంపతుల్లో.. భార్య, భర్తను ఫంక్షన్కు పంపించింది. అతను ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ ఉదయ్ తెలిపిన సమాచారం ఇలా ఉంది.. 

 జి ప్రశాంత్, తేజస్వినిలు భార్యాభర్తలు. వీరికి 2020 నవంబర్లో వివాహమయ్యింది. హైదరాబాదులోని రహమత్ నగర్ లో వీరు కాపురం ఉంటున్నారు.. భర్త ప్రశాంత్ కొరియర్ బాయ్ గా పని చేస్తున్నాడు. ప్రశాంత్ కు కిరణ్, మరికొంతమంది యువకులతో ఈ నేపథ్యంలోనే పరిచయమయ్యింది. స్నేహితులు కావడంతో తరచుగా ప్రశాంత్ ఇంటికి వచ్చి పోతుండేవారు.

హైదరాబాద్ చందానగర్ లో విషాదం, గోడకూలి కార్మికుడు మృతి...

కిరణ్ ప్రశాంత్ కుటుంబంతో బాగా కలిసిపోయాడు. తేజస్వినిని అమ్మా అని ఒకసారి, అక్క అని మరోసారి వివిధ రకాలుగా సంబోధిస్తూ…వేరే వారికి పరిచయం చేసేటప్పుడు కూడా తన సంబంధించిన వారిలాగానే పరిచయం చేసేవాడు. ఈనెల 20వ తేదీన వీరి బంధువుల ఫంక్షన్ ఒకటి ఉంది. దానికి వెళదామని భార్యను ప్రశాంత్ అడిగాడు.

నేను రాలేను నువ్వు ఒక్కడివే వెళ్ళిరా అని చెప్పింది తేజస్విని. భర్తను నీట్ గా తయారు చేసి మరీ పంపించింది. త్వరగా ఇంటికి వచ్చేయమని కూడా చెప్పింది. ఫంక్షన్ ముగించుకుని ప్రశాంత్ ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించలేదు. 

ఇంట్లో ఆమెకి సంబంధించిన నగదు, బట్టలు, ఇతర వస్తువులు కూడా లేవు. ఆమె గురించి చుట్టుపక్కల వారిని అడిగిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో తేజస్విని కనిపించడం లేదన్న విషయం తెలిసి కిరణ్ స్నేహితుడు కూడా వచ్చి వెతకడం ప్రారంభించారు. కానీ కిరణ్ మాత్రం రాలేదు. వీరంతా కలిసి తమకు తెలిసిన ప్రదేశాలన్నింటిలో వెతికినా కూడా దొరకకపోవడంతో మధురానగర్ పోలీసులకు ప్రశాంత్ ఫిర్యాదు చేశాడు. 

ఆ ఫిర్యాదులో కిరణ్ మీద తనకు అనుమానం ఉన్నట్లుగా తెలిపాడు. తన భార్యకు పిల్లలు లేరని మాయమాటలు చెప్పి తేజస్వినిని తీసుకెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. ప్రశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.