హైదరాబాద్: సమ్మెలో ఉన్న కార్మికులతో చర్చలు జరపాలని  ఏ ప్రాతిపదికన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ సమ్మె విషయమై సుప్రీంకోర్టుకు చెందిన రిటైర్డ్ జడ్జిలతో కమిటీని ఏర్పాటు చేస్తామని  తెలంగాణ హైకోర్టు ప్రకటించింది.

Also read:మా పరిధిలో ఉందా, లేదా చూస్తాం: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు

ఈ విషయమై తమ అభిప్రాయం చెబుతామని రేపు చెబుతామని అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.

Also read:ఆర్టీసీ నష్టాలు రూ.5269 కోట్లు: అఫిడవిట్‌లో వివరాలివీ...

ఆర్టీసీ సమ్మెతో పాటు, ఆర్టీసీ ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లపై నిన్నటి విచారణను మంగళవారం నాడు ఆర్టీసీ కొనసాగించింది. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ రెండు పిటిషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

కార్మికులతో చర్చలు జరపాలని  ఆదేశించాలని తాము ఆదేశించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయమై ఏ చట్టంలో ఉందో చెప్పాలని హైకోర్టు  ప్రశ్నించింది. సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కానీ, ఆర్టీసీ యాజమాన్యాన్ని కానీ తాము ఎలా  ఆదేశిస్తామని హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కార్మికులతో చర్చలు జరపాలని తాము ఏ ప్రాతిపదికన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు అడిగింది.

Also Read:యూనియన్లతో ఇక చర్చల్లేవ్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు చెప్పనున్న కేసీఆర్ సర్కార్

తాము కూడ చట్టానికి లోబడే పనిచేస్తామని హైకోర్టు చెప్పింది. చట్టానికి అతీతంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ సాగుతున్నందున తదుపరి చర్యలు తీసుకోలేకపోయినట్టుగా అడ్వకేట్ జనరల్ ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మెపై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలతో కమిటీని ఏర్పాటు చేస్తామని హైకోర్టు ప్రకటించింది. అయితే ఈ విషయమై మీ వైఖరిని చెప్పాలని  తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ వైఖరిని రేపు చెబుతామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. దీనికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హైకోర్టు అధికారాలు, పరిధులపై సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్ వివరణ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తోందని విద్యాసాగర్ చెప్పారు.గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడెలా వర్తిస్తాయని హైకోర్టు ప్రశ్నించింది.

 

1998, 2015 ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 1998 ఉత్తర్వులు ఏపీఎస్‌ఆర్టీసీకే వర్తిస్తాయని చెప్పింది. టీఎస్ ఆర్టీసీకి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రశ్నించింది. 2015 ఉత్తర్వులు ఆరు మాసాలకే వర్తిస్తాయని హైకోర్టు గుర్తు చేసింది.