హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్టీసీ యూనియన్లతో ఇక చర్చలు ఉండవని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.ఈ మేరకు హైకోర్టు తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉంది.

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 11వ తేదీన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని నిర్ణయం తీసుకొంది. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో  సోమవారం నాడు విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా అఫిడవిట్లో తెలంగాణ ప్రభుత్వం తన వాదనను విన్పించే అవకాశం ఉంది.

Also read:ఈ నెల 12న నిరవధిక దీక్షకు దిగుతున్నాం: ఆశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో  హైకోర్టులో దాఖలు చేయాల్సిన అఫిడవిట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం నాడు సుధీర్ఘంగా చర్చించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ యూనియన్లతో ఇక చర్చలు ఉండవని  ఈ అఫిడవిట్లో ప్రభుత్వం చెప్పనుంది. ఆర్టీసీకి ప్రభుత్వం గతంలో చాలా మేరకు ఆర్ధికంగా సహాయం చేసింది. ఇక భవిష్యత్తులో సహాయం చేసే అవకాశం లేదని కూడ చెప్పనుంది సమాచారం.

also read:RTC Strike:'చట్టబద్దత లేదా, ఆ తర్వాతే సుప్రీంకు'

ఆర్టీసీ సమ్మె విషయమై  ఇరు వర్గాలు మెట్టు దిగాలని తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన ఆదేశించింది. అయితే చర్చలు మాత్రం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన పట్టును వీడడం లేదు. ఆర్టీసీ జేఎసీ నేతలు కూడ సమ్మె విషయంలో తమ వైఖరిని వీడలేదు. ఈ నెల 18వ తేదీ వరకు ఆర్టీసీ జేఎసీ నేతలు తమ కార్యక్రమాలను ప్రకటించారు.

ఈ నెల 12వ తేదీన నిరవధిక దీక్షకు కూడ దిగుతామని ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని కూడ జేఎసీ నేతలు ఆదివారం నాడు  ప్రభుత్వాన్ని కోరారు.ఆర్టీసీ సమ్మె విషయంలోప్రభుత్వం దాఖలు చేసిన లెక్కలపై హైకోర్టు తప్పుడు లెక్కలంటూ చెప్పడాన్ని కూడ సీఎం కొంత వేదనకు గురైనట్టుగా సమాచారం.