Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ నష్టాలు రూ.5269 కోట్లు: అఫిడవిట్‌లో వివరాలివీ...

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు హైకోర్టులో అఫిడవిట్ ను సమర్పించనుంది. 

Telangana government to pay Rs.22609 crore for RTC
Author
Hyderabad, First Published Nov 11, 2019, 8:06 AM IST

హైదరాబాద్:  ఆర్టీసీ సమ్మెపై విచారణను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్‌ను సమర్పించనుంది.ఆర్టీసీ నష్టాల్లో ఉందని తెలిసి కూడ కార్మికులు సమ్మెలోకి వెళ్లారని ప్రభుత్వం స్పష్టం చేయనుంది. 

Also Read:యూనియన్లతో ఇక చర్చల్లేవ్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు చెప్పనున్న కేసీఆర్ సర్కార్

మరోవైపు ఆర్టీసీ రూ.ఈనెల 8వ తేదీ వరకు మొత్తం రూ.2,209.66 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అఫిడవిట్‌లో సర్కారు పేర్కొంది. ఇవాళ హైకోర్టులో ఈ అఫిడవిట్‌ను సమర్పించనుంది. ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు సోమవారం నాడు ఏ రకమైన తీర్పు చెప్పనుందో తేలనుంది.

Also read:ఈ నెల 12న నిరవధిక దీక్షకు దిగుతున్నాం: ఆశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ కార్మికుల కోసం ఒక్క రూపాయి కూడ విడుదల చేసేదీ లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించనుంది.ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం ఈ అఫిడవిట్‌లో వివరాలను అందించనుంది.ఆర్టీసీకి ఈనెల 8వ తేదీ వరకు మొత్తం రూ.2,209.66 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అఫిడవిట్‌లో సర్కారు స్పష్టం చేసింది.
 
 ఆర్టీసీ కార్మికుల ప్రధానమైన నాలుగు డిమాండ్ల పరిష్కారం కోసం  రూ. 47 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూచించింది. ఈ సూచనలపై సానుకూలంగానే స్పందించినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీకి పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నందున చట్టబద్దమైన చెల్లింపులు చేయాల్సి ఉందని ఆ అఫిడవిట్‌లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

also read:RTC Strike:'చట్టబద్దత లేదా, ఆ తర్వాతే సుప్రీంకు'

ఎప్పటికప్పుడూ నష్టాలు వస్తూనే ఉన్నాయి, అయితే రూ. 47 కోట్లు చెల్లించినా కూడ ఆర్టీసీ నష్టాలను పూడ్చలేమని ప్రభుత్వం అభిప్రాయపడింది. గతంలో ఆర్టీసీని కాపాడేందుకు గాను ఎప్పటికప్పుడు ఆర్ధికంగా ఆదుకొన్నాం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రూ. 47 కోట్లను ఆర్టీసీకి ఇప్పుడు కేటాయించలేమని ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి హైకోర్టుకు సోమవారం నాడు ఈ అఫిడవిట్ ను సమర్పించనున్నారు. 18 అంశాలతో హైకోర్టుకు సమర్పించే అఫిడవిట్ ను సిద్దం చేశారు. చర్చలు జరుగుతున్న సమయంలోనే కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లిన నేపథ్యంలోనే సమ్మెకు వెళ్లినందున కార్మిక చట్టాల ప్రకారంగా ఆర్టీసీ కార్మికులపై చర్యలు తీసుకోవాలని ఆ అఫిడవిట్ లో ప్రభుత్వం కోరింది.

ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది, సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్ధికంగా ఆదుకొనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.నష్టాలు తగ్గలేదు. సంస్థ భవిష్యత్తు నష్టాల్లో ఉన్న విషయం తెలిసి కూడ ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారని ఈ అఫిడవిట్ లో పేర్కొంది.ప్రధాన పండుగల సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని అఫిడవిట్ లో ప్రభుత్వం పేర్కొంది. 

ఈ ఏడాది ఆగష్టు నెలాఖరుకు  ఆర్టీసీ రూ. 5269 కోట్లలో ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఇతర సంస్థలకు ఆర్టీసీ రూ. 1786 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 10,460 బస్సులున్నాయి. అయితే వీటిలో 2609 బస్సులు కాలం చెల్లినట్టుగా ప్రభుత్వం అఫిడవిట్‌లో ప్రకటించింది. కాలం చెల్లిన బస్సులను వెంటనే మార్చాల్సి ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది.

గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షల కిలోమీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 13 లక్షల కి.మీ.మాత్రమే బస్సులు నడవాలి. లేదా ప్రతి 15 ఏళ్ల కంటే ఎక్కువ రోజులు బస్సులను వినియోగించకూడదని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసింది. కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ. 750 కోట్లు అవసరం కానున్నాయి. మరో 476 పాత బస్సులను మార్చాలంటే నిధులు  అవసరమని కూడ ప్రభుత్వం ఈ అఫిడవిట్‌లో ప్రస్తావించింది.

అయోధ్య వివాదంపై తీర్పు వచ్చే రోజునే ఆర్టీసీ జేఎసీ చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పిలుపునివ్వడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది.హైద్రాబాద్ చాలా సున్నితమైన ప్రాంతమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios