హైదరాబాద్:ఆర్టీసీ సమ్మెను విరమింపజేసే అధికారం తమకు ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.

Also Read:యూనియన్లతో ఇక చర్చల్లేవ్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు చెప్పనున్న కేసీఆర్ సర్కార్

ఆర్టీసీసమ్మెపై తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు మధ్యాహ్నం విచారణ ప్రారంభమైంది. ఆర్టీసీ ప్రైవేటీకరణపై సోమవారం నాడు ఉదయం విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈ పిటిషన్‌ను కూడ ఆర్టీసీ సమ్మెపై విచారణ సమయంలో విచారణ చేస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది.

Also read:ఈ నెల 12న నిరవధిక దీక్షకు దిగుతున్నాం: ఆశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్దమైందని  ఆర్టీసీ కార్మికుల తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.సమ్మెను విరమింపజేసే అధికారం మా పరిధిలో ఉందా లేదా అనేది చూసామన్నారు.

అయితే ఆర్టీసీ సమ్మెను విరమించాలని ఆదేశిస్తే, కార్మికులు సమ్మెను కొనసాగిస్తే సమ్మె అక్రమమా, సక్రమమా అనే విషయం కూడ పరిశీలిస్తామని హైకోర్టు అభిప్రాయపడింది.

Also read:ఆర్టీసీ నష్టాలు రూ.5269 కోట్లు: అఫిడవిట్‌లో వివరాలివీ...

ఆర్టీసీ వేల కోట్ల రూపాయాలు బకాయిలు ఉన్నందున రూ. 47 కోట్లు చెల్లిస్తే సరిపోవని ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తేల్చి చెప్పింది.  అయితే జూనియర్ డాక్టర్ల సమ్మె సమయంలో  హైకోర్టు డాక్టర్లతో సమ్మెను విరమింపజేసిన విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఎస్మా చట్టం ప్రకారంగా ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్దమని పిటిషనర్ తరపు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టుకు చెప్పారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం స్పందించింది. ఎస్మా చట్టం ప్రకారంగా  ఆర్టీసీని తప్పనిసరిగా సర్వీస్ గాపేర్కొంటూ జారీ చేసిన జీవో చూపాలని హైకోర్టు కోరింది.

ఆర్టీసీని ప్రజా ప్రయోజన సేవ సర్వీస్ గా ప్రకటించినందున ఎస్మా పరిధిలోకి  వస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా ప్రయోజన సేవలన్నీ అత్యవసర సర్వీసులు కావని హైకోర్టు అభిప్రాయపడింది. రూట్ల ప్రైవేటీకరణ, రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకొన్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది.