Asianet News TeluguAsianet News Telugu

చెన్నూరు గులాబీ లొల్లి: కేటీఆర్‌తో వివేక్, వినోద్ భేటీ

 చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్టును వినోద్ కు కేటాయించాలని  కోరుతూ మంత్రి కేటీఆర్‌తో మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ బుధవారం నాడు సమావేశమయ్యారు.

vivek and vinod meeting with minister ktr
Author
Chennur, First Published Oct 10, 2018, 6:47 PM IST


హైదరాబాద్: చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్టును వినోద్ కు కేటాయించాలని  కోరుతూ మంత్రి కేటీఆర్‌తో మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ బుధవారం నాడు సమావేశమయ్యారు.

చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పోటీ చేస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు బదులుగా బాల్క సుమన్ ‌కు ఈ స్థానాన్ని కేసీఆర్ కేటాయించారు.

అయితే చెన్నూరు స్థానాన్ని మాజీ మంత్రి వినోద్ కోరుతున్నారు.  గతంలో వినోద్ ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు. వినోద్‌కు కాకుండా బాల్క సుమన్‌కు టీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించడంపై వివేక్ , వినోద్‌లు అసంతృప్తితో ఉన్నారు.

రెండు రోజుల క్రితం వివేక్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించినా కూడ ప్రచారంలో పాల్గొనలేదు. వివేక్ వర్గీయులు  కూడ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.

చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్టు విషయమై  వివేక్, వినోద్‌లు  బుధవారం నాడు  మంత్రి కేటీఆర్‌తో చర్చించారు. చెన్నూరు టిక్కెట్టును వినోద్‌కు ఇవ్వాలని  కేటీఆర్ ను కోరారు.  అయితే ఈ విషయమై  కేసీఆర్‌తో చర్చిస్తానని కేటీఆర్ వినోద్, వివేక్‌లకు హమీ ఇచ్చారు.

తనకు రెండు రోజుల సమయం ఇవ్వాలని కేటీఆర్ వినోద్, వివేక్‌లను కోరారు. అయితే ప్రకటించిన అభ్యర్థులను మార్చే ప్రసక్తేలేదని  కేసీఆర్ ఇదివరకే ప్రకటించినట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. 

ఇప్పటికే  చెన్నూరులో ఓదేలును కాదని సుమన్ టిక్కెట్టు కేటాయించడంపై  ఓదేలు కొంత అసంతృప్తితో ఉన్నారు. అయితే కేసీఆర్ ఓదేలుతో చర్చించడంతో ఆయన కాస్త  మెత్తబడ్డారు. తాజాగా  వినోద్ కూడ తనకు ఇదే టిక్కెట్టు కోరడం టీఆర్ఎస్ నాయకత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.

 

సంబంధిత వార్తలు

చెన్నూరులో బాల్క సుమన్‌కు మరో సెగ: వివేక్ అసంతృప్తి

చెన్నూరు బాల్క సుమన్ దే: నో ఛేంజ్ అంటున్న కేటీఆర్

బాల్క‌సుమన్, ఓదేలు సీటు పోరులో గట్టయ్య బలి

కేసీఆర్ తో భేటీ తర్వాత మీడియాతో ఓదేలు (వీడియో)

సుమన్‌పై హత్యాయత్నం: ఏసీపీ, శవరాజకీయాలన్న ఓదేలు

టీఆర్ఎస్ లో టికెట్ల చిచ్చు... ఐదుగురు టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

నాపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించారు : బాల్క సుమన్

బాల్కసుమన్ కు షాక్: ఒంటికి నిప్పంటించుకొన్న ఓదేలు అనుచరుడు

టీఆర్ఎస్‌లో చెన్నూరు టిక్కెట్టు చిచ్చు: స్వీయ నిర్బంధంలో ఓదేలు

టిక్కెట్ కట్: కేసీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు భేటీ

సిట్టింగ్ సీటు కోల్పోయిన మాజీ జర్నలిస్ట్: ఆంథోల్ లో క్రాంతికి సీటు

కేసీఆర్ కు తలనొప్పి: సిట్టింగ్ లపై తిరుగుబాట్లు

 

Follow Us:
Download App:
  • android
  • ios