సెప్టెంబర్ 12వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్య యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు మృతి చెందాడు.మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చెన్నూరు టీఆర్ఎస్ టిక్కెట్టును తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కేటాయించకుండా పెద్దపల్లి ఎంపీ  బాల్క సుమన్ కు కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.  బాల్క సుమన్  చెన్నూరు నియోజకవర్గంలో  ప్రచారం చేసేందుకు  సెప్టెంబర్ 12వ తేదీన ఇందారం గ్రామానికి చేరుకొన్నారు.

అయితే ఈ సమయంలో  ఇందారం గ్రామంలో  సీసీరోడ్డుకు బాల్క సుమన్ శంకుస్థాపన చేస్తున్న సమయంలో  గట్టయ్య  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చెన్నూరు  టిక్కెట్టు  ఓదేలుకు కేటాయించకపోవడంపై  నిరసనగా  గట్టయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో గట్టయ్యతో పాటు మరో ఆరుగురు కూడ తీవ్రంగా గాయపడ్డారు.  వీరంతా కూడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో వైపు గట్టయ్య యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మంగళవారం నాడు  మృతి చెందాడు.

ఇదిలా ఉంటే  తనను హత్య చేసేందుకే గట్టయ్య ప్రయత్నించాడని  బాల్క సుమన్ ఆరోపించాడు. ఇదే రకంగా పోలీసులకు ఫిర్యాదు కూడ చేశారు.ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

ఈ ఘటన జరిగిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఓదేలును పిలిపించి మాట్లాడారు. దీంతో  పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని  ఆయన ఓదేలు ప్రకటించారు. ఓదేలుకు టిక్కెట్టు రాలేదనే  బాధతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన గట్టయ్య.. ప్రస్తుతం సుమన్.. ఓదేలు కలిసిపోవడం పట్ల  ఆవేదన వ్యక్తం చేసినట్టు ప్రచారం సాగుతోంది.

అతి నిరుపేద కుటుంబానికి చెందిన గట్టయ్య మృతితో ఆ కుటుంబం వీధినపడింది. గట్టయ్య మృతితో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

ఈ వార్తలు చదవండి

కేసీఆర్ తో భేటీ తర్వాత మీడియాతో ఓదేలు (వీడియో)

సుమన్‌పై హత్యాయత్నం: ఏసీపీ, శవరాజకీయాలన్న ఓదేలు

టీఆర్ఎస్ లో టికెట్ల చిచ్చు... ఐదుగురు టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

నాపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించారు : బాల్క సుమన్

బాల్కసుమన్ కు షాక్: ఒంటికి నిప్పంటించుకొన్న ఓదేలు అనుచరుడు

టీఆర్ఎస్‌లో చెన్నూరు టిక్కెట్టు చిచ్చు: స్వీయ నిర్బంధంలో ఓదేలు

టిక్కెట్ కట్: కేసీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు భేటీ

సిట్టింగ్ సీటు కోల్పోయిన మాజీ జర్నలిస్ట్: ఆంథోల్ లో క్రాంతికి సీటు

కేసీఆర్ కు తలనొప్పి: సిట్టింగ్ లపై తిరుగుబాట్లు