మంచిర్యాల: చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం నాడు ప్రచారానికి వెళ్లిన ఎంపీ బాల్క సుమన్ కు చేదు అనుభవం ఎదురైంది.  తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య సుమన్ ప్రచారాన్ని అడ్డుకోవడంతో పాటు  ఆత్మహత్యాయానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో గట్టయ్యతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

నల్లాల ఓదేలుకు చెన్నూరు టిక్కెట్టును టీఆర్ఎస్ కేటాయించలేదు. అయితే ఈ స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కు టిక్కెట్టును కేటాయించింది. ఈ విషయమై ఓదేలు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

మంగళవారం నాడు తన ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలిసి స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. అయితే కేసీఆర్ ఓదేలుకు ఫోన్ చేసి బుధవారం నాడు హైద్రాబాద్ లో అందుబాటులో ఉండాలని ఆదేశించాడు.

బుధవారం నాడు ఇందారంలో ప్రచారానికి వచ్చిన బాల్కసుమన్ ప్రచారాన్ని ఓదేలు అనుచరులు అడ్డుకొన్నారు. అంతేకాదు ఓదేలు అనుచరుడు గట్టయ్య పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

దీంతో గట్టయ్యతో పాటు ఆయన చుట్టు ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వార్తను కవరేజీ చేయడానికి వెళ్లిన ఓ మీడియా ఛానెల్ కెమెరామెన్ కు కూడ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ వార్తలు చదవండి

టీఆర్ఎస్‌లో చెన్నూరు టిక్కెట్టు చిచ్చు: స్వీయ నిర్బంధంలో ఓదేలు

టిక్కెట్ కట్: కేసీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు భేటీ

సిట్టింగ్ సీటు కోల్పోయిన మాజీ జర్నలిస్ట్: ఆంథోల్ లో క్రాంతికి సీటు

కేసీఆర్ కు తలనొప్పి: సిట్టింగ్ లపై తిరుగుబాట్లు