తన సోదరుడికి చెన్పూరు టిక్కెట్టు రాకపోవడంతో మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగుతోంది..  


కరీంనగర్: తన సోదరుడికి చెన్పూరు టిక్కెట్టు రాకపోవడంతో మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. దీంతో వివేక్ అనుచరులు ఏం చేయాలనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు.

మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి వారసులుగా చెన్నూరు నుండి వినోద్, పెద్దపల్లి నుండి వివేక్ ఎంపీగా రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కె.కేశవరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి వీరిద్దరూ టీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు వివేక్ సోదరరులిద్దరూ కూడ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు.

2014 ఎన్నికల్లో వివేక్, వినోద్ లు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లేదనే ఉద్దేశ్యంతో 2016లో వివేక్, వినో‌ద్‌లు టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరిన ఆరు మాసాలకే వివేక్‌ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా తెలంగాణ సర్కార్ నియమించింది. 

పెద్దపల్లి ఎంపీ టిక్కెట్టు విషయంలో వివేక్‌కు లైన్ క్లియర్ అయింది. అయితే చెన్నూరు నుండి వినోద్ కు మాత్రం టిక్కెట్టు దక్కలేదు. చెన్నూరు నుండి సిట్టింగ్ ఎంపీ బాల్క సుమన్ కు కేటాయించారు. 

 మంగళవారం పెద్దపల్లి, రామగుండం వచ్చిన వివేక్‌ స్థానిక నేతలను పరామర్శించి వెళ్లిపోయారు., ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.నియోజకవర్గంలో వివేక్‌ వర్గంగా ఉన్న నేతలు ప్రచారంలో ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఆయన అనుచరులు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

చెన్నూరు బాల్క సుమన్ దే: నో ఛేంజ్ అంటున్న కేటీఆర్

బాల్క‌సుమన్, ఓదేలు సీటు పోరులో గట్టయ్య బలి

కేసీఆర్ తో భేటీ తర్వాత మీడియాతో ఓదేలు (వీడియో)

సుమన్‌పై హత్యాయత్నం: ఏసీపీ, శవరాజకీయాలన్న ఓదేలు

టీఆర్ఎస్ లో టికెట్ల చిచ్చు... ఐదుగురు టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

నాపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించారు : బాల్క సుమన్

బాల్కసుమన్ కు షాక్: ఒంటికి నిప్పంటించుకొన్న ఓదేలు అనుచరుడు

టీఆర్ఎస్‌లో చెన్నూరు టిక్కెట్టు చిచ్చు: స్వీయ నిర్బంధంలో ఓదేలు

టిక్కెట్ కట్: కేసీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు భేటీ

సిట్టింగ్ సీటు కోల్పోయిన మాజీ జర్నలిస్ట్: ఆంథోల్ లో క్రాంతికి సీటు

కేసీఆర్ కు తలనొప్పి: సిట్టింగ్ లపై తిరుగుబాట్లు