విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: 36 గంటల సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ 36 గంటల సత్యగ్రహ దీక్షను ప్రారంభించింది కార్మిక సంఘాల జేఏసీ రేపు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. 

Visakha Steel  Plant JAC Ukku Satyagraha Deeksha begins

విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు ఇవాళ్టి నుండి 36 గంటల పాటు సత్యగ్రహ దీక్షకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖస్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.  విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు రిలే దీక్షలను ప్రారంభించారు. 2021 ఫిబ్రవరి 12వ తేదీన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరహారదీక్షలకు దిగారు. ఈ దీక్షలు ఇవాళ్టికి 549 రోజులకు చేరుకున్నాయి. దీంతో ఇవాళ ఉదయం ఆరు గంటల నుండి సత్యగ్రహ దీక్షకు దిగారు.  రేపు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ సత్యగ్రహ దీక్ష కొనసాగనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు రేపటికి 550 రోజులకు చేరుకుంటాయి.   

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు సాగిన విషయాన్ని విశాఖ కార్మిక సంఘాల జేఏసీ గుర్తు చేసింది.విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విశాఖలో కాల్పులు చోటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కోరుతూ  బీజేపీ కార్యాలయాలను కూడా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో  గతంలో  ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.  అయితే ఏపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు కూడా ఈ విషయమై కేంద్రంతో చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించ వద్దని కూడా కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా తాము కూడా  ప్రయత్నం చేస్తామని బీజేపీ నేతలు కూడా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ విషయమై బీజేపీ నేతలను ఇతర పార్టీలు లక్ష్యంగా విమర్శలు చేశాయి. అంతే స్థాయిలో వైసీపీ పై కూడా  ఇతర పార్టీలు విమర్శల దాడిని పెంచాయి. . న్యూఢిల్లీకి వెళ్లిన సమయంలో ప్రధాని, కేంద్ర మంత్రులతో ఈ విషయమై సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని టీడీపీ విమర్శలు చేసింది. అయితే కార్మిక సంఘాల జేఏసీకి చెందిన నేతలను కూడా ప్రధాని వద్దకు తీసుకెళ్తానని కూడా సీఎం జగన్ హామీ ఇచ్చారు.ఈ విషయమై ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతానని కూడా జగన్ ప్రకటించారు. 

also read:Andhra News: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చించా...: పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. జైలు భరో కార్యక్రమంతో పాటు రాష్ట్ర బంద్ కు కూడా గతంలో కార్మిక సంఘాల జేఏసీ చేపట్టింది. ఈ కార్యక్రమాలు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కూడా మద్దతును ప్రకటించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్  లాభాల్లోకి వచ్చేందుకు కార్మిక సంఘాల జేఏసీ కొన్ని ముఖ్య సూచనలను కూడా చేేసింది. కానీ కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios