తెెలంగాణకు సంబంధించిన పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ప్రముఖ దేవాలయం సలేశ్వరం నేపథ్యంలో సాగే ఓ వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారుతోంది.

Viral Video : తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి... వీటిలో నల్లమల అభయారణ్యంలో సలేశ్వర ఆలయం ఒకటి. ఇలాంటి చారిత్రక ఆలయం గురించి చాలామందికి తెలియదు... అందుకే దీని విశిష్ఠతను తెలియజేస్తూ సాగే ఓ వీడియో సాంగ్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. మూడున్నర నిమిషాల నిడివిగల ఈ పాటలో సలేశ్వరం అణువణువును వర్ణిస్తూ సాగిపోతూ ఉంటుంది. చిన్నారులు ఆశ్వి, స్వీక్ష, సహస్ర నృత్యం ఆకట్టుకునేలా ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ యూట్యూబ్ సాంగ్ కు సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు... శ్రీకీర్తి అద్భుతంగా పాడారు. రసమోళ్ళ చంద్రయ్య, మొగుళ్ల కురుమయ్య, రామారావు సాహిత్యం అందించారు. గద్దర్ అవార్డు గ్రహీత కుంభం ఉదయ్ ఎడిటింగ్ అందించారు.. తమ్ముడు శ్రీను, చెన్నారెడ్డి, మల్కాపూర్ మోహన్, చంద్రశేఖర్ గౌడ్ విజువల్ సహకారం అందించారు.

అద్భుతమైన టెక్నీషన్స్ సహకారంతో రూపుదిద్దుకున్న ''అందాల వనం సలేశ్వరాలయం'' ఆకట్టుకుంటోంది. ఈ పాటకు వీవర్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సాంగ్ ను మీరూ చూడాలనుకుంటే కింది లింక్ పై క్లిక్ చేయండి.

YouTube video player