టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి సవాల్ విసిరారు.  కేసీఆర్, వంటేరు.. ఇద్దరూ గజ్వేల్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కి డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తానని వంటేరు ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటికే కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే హరీష్ రావు 40 రోజులుగా గజ్వేల్ లో మకాం వేశారని అన్నారు.  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వంటేరు ప్రతాప్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వంటేరు కేసీఆర్ కి సవాల్ విసిరారు. ‘ గజ్వేల్ లో నేను ప్రచారం చేయను, కేసీఆర్ కూడా చేయొద్దు. ప్రజలు ఎవరు గెలిపిస్తారో చూద్దాం’ అంటూ సవాల్ వసిరారు. తనపై అక్రమంగా కేసులు పెట్టి.. తన ఇంట్లో అర్థరాత్రి సోదాలు చేయించి.. తనను అరెస్టు చేశారని వంటేరు ఆవేదన వ్యక్తం చేశారు.

గజ్వేలో మద్యం ఏరులై పారుతోందని.. హరీష్ రావు కోట్లు గుమ్మరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

read more news

వంటేరు ఇంటి వద్ద హైడ్రామా.. అరెస్ట్

ఇంట్లో పోలీసుల సోదాలు.. వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం

వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు

ఈసీతో వంటేరు సమావేశం...కేసీఆర్ ఫాంహౌస్‌పై సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ పై పోటీ: ఒంటేరు ప్రతాప్ రెడ్డికి సీరియస్, ఆస్పత్రిలో చికిత్స

వంటేరు దీక్షను భగ్నం చేసిన పోలీసులు (వీడియో)

హరీశ్! యాది పెట్టుకో.. నీ రబ్బరు చెప్పులు మళ్లొస్తయ్: వంటేరు