వంటేరు ప్రతాప్ రెడ్డి మేడ్చల్‌ నివాసం వద్దహైడ్రామా చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం వంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అర్థరాత్రి ప్రతాప్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించేందుకు మేడ్చల్ పోలీసులు వెళ్లిన సంగతి తెలిసిందే.

అంతకు ముందు రోజే.. అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరిన వంటేరు.. ఆ రోజే డిశ్చార్జ్ అయ్యారు. ఇలా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఒక్క రోజు కూడా గడవకముందే.. తన ఇంట్లో పోలీసులు సోదాలు చేయడానికి రావడంతో.. వంటేరు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

వంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. కాగా.. అతనిని అడ్డుకున్న పోలీసులు వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేశారు. 

 

read more news

ఇంట్లో పోలీసుల సోదాలు.. వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం

వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు

ఈసీతో వంటేరు సమావేశం...కేసీఆర్ ఫాంహౌస్‌పై సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ పై పోటీ: ఒంటేరు ప్రతాప్ రెడ్డికి సీరియస్, ఆస్పత్రిలో చికిత్స

వంటేరు దీక్షను భగ్నం చేసిన పోలీసులు (వీడియో)

హరీశ్! యాది పెట్టుకో.. నీ రబ్బరు చెప్పులు మళ్లొస్తయ్: వంటేరు