గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సోమవారం అర్థరాత్రి హైదరాబాద్ కొంపల్లిలోని ఆయన కుమారుడు విజయ్‌రెడ్డి ఇంటికి వచ్చిన పోలీసులు సోదాలు నిర్వహించారు.

ఇంట్లో భారీ ఎత్తున నగదు, మద్యం నిల్వలు ఉన్నాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందిందని... అధికారుల ఆదేశాల మేరకు ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు.

నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ ఆస్తులపై ఆయన మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు. ఆ మరుసటి రోజే ఆయన ఇంట్లో సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

"