తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న(ఆదివారం) కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వెల్ రిటర్సింగ్ అధికారి కార్యాలయం ఎదుటు ధర్నాకు దిగగా...పోలీసులు అతన్ని బలవంతంగా అక్కడినుండి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వంటేరు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో గజ్వేల్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

చికిత్స అనంతరం కోలుకున్నాక వంటేరు మళ్లీ ఇవాళ ఈసీ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలుసుకున్నారు. అధికార అండతో గజ్వేల్ లో టీఆర్ఎస్ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని వంటేరు ఫిర్యాదు చేశారు. భారీగా డబ్బులు పంచుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా సివిల్ కేసులు బనాయించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వంటేరు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈసీతో భేటీ అనంతరం వంటేరు మాట్లాడుతూ...తమ వాహనాల్లో తనిఖీలు చేపట్టడం మాని ముందు కేసీఆర్ ఫాంహౌస్ లో తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఆ ఫామ్ హౌస్ వైపు పోలీసులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపించారు. ఫామ్ హౌస్‌లో ఎన్నికలకోసం దాచిన వేలకోట్ల రూపాయలను పోలీసులు ఎందుకు సీజ్‌ చేయ్యట్లేదని వంటేరు  ప్రశ్నించారు.

గజ్వెల్ లో ఇప్పటికే టీఆర్ఎస్ రూ.50 కోట్లు కుమ్మరించిందని.. ఆ సొమ్ము ఎక్కడిదని వంటేరు ప్రశ్నించారు.  గజ్వేల్ లో మీరు, మేము (మహాకూటమి, టీఆర్ఎస్) ఎవ్వరూ ప్రచారం చేయొద్దని...ప్రజలు స్వచ్చందంగా ఓటేసి ఎవర్ని గెలిపించుకుంటారో చూద్దామని సవాల్ విసిరారు. అసలు కేసీఆర్ ఏం అభివృద్ది చేశారని ప్రజలు ఆయనకు ఓటేయాలని వంటేరు ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు

హరీశ్! యాది పెట్టుకో.. నీ రబ్బరు చెప్పులు మళ్లొస్తయ్: వంటేరు

కేసీఆర్ పై పోటీ: ఒంటేరు ప్రతాప్ రెడ్డికి సీరియస్, ఆస్పత్రిలో చికిత్స