Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ పై జోక్: అన్నం తెలుగు పదం కాదన్న వాజ్ పేయి

అటల్ బిహారీ వాజ్ పేయి గొప్ప వక్త, మంచి మాటకారి. ప్రసంగాలను కవితా పంక్తులతో, చమత్కారాలతో అత్యంత రసవత్తరంగా సాగించేవారు. ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోని ప్రతిపక్షాలను ఏకతాటి మీదికి తెచ్చే ప్రయత్నాలు చేశారు. 

Vajapayee comments on NTR
Author
Hyderabad, First Published Aug 16, 2018, 7:24 PM IST

హైదరాబాద్: అటల్ బిహారీ వాజ్ పేయి గొప్ప వక్త, మంచి మాటకారి. ప్రసంగాలను కవితా పంక్తులతో, చమత్కారాలతో అత్యంత రసవత్తరంగా సాగించేవారు. ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోని ప్రతిపక్షాలను ఏకతాటి మీదికి తెచ్చే ప్రయత్నాలు చేశారు. 

అందులో భాగంగా ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన సదస్సులో ఒకదానికి వాజ్ పేయి కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్ కు అతిథులకు మర్యాద చేయడాన్ని సంప్రదాయంగా పాటిస్తూ వచ్చారు.  భోజనాల వేళ ఎన్టీఆర్ బకెట్లో వెన్న తెచ్చి స్వయంగా వడ్డించసాగారు. 

అటువంటి సందర్భంలో వాజ్ పేయి సరదా ఎన్టీఆర్ పై ఓ జోక్ వేశారు. రామారావు సాబ్ నే హమ్ కో మస్కా లగా రహా హై (రామారావుగారు మస్కా కొడుతున్నారు) అని  ఓ జోక్ వేశారు. దాంతో అందరూ నవ్వారు. 

అదే సమయంలో వాజ్ పేయి సునిశిత పరిశీలనకు, జిజ్ఞాసకు, అధ్యయనానికి ఉదాహరణగా తెలుగు సీనియర్ జర్నలిస్టులు ఇప్పటికీ ఓ మాట చెబుతుంటారు. భోజనాల వేళ రైస్ అనే పదానికి తెలుగు పదం ఏమిటని వాజ్ పేయి అడిగారట. దాంతో అన్నం అని చెప్పారట. 

అయితే, అన్నం తెలుగు పదం కాదని, అది సంస్కృత పదమని, తెలుగు పదం ఏదో ఉండి ఉంటుందని అన్నారట. అయితే, అన్నం అనేదానికి తెలుగు పదం బువ్వ కావచ్చునని ఓ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఓ సందర్భంలో చెప్పారు.  

ఈ వార్తలు చదవండి

కూలిన శిఖరం: వాజ్‌పేయ్ ఇకలేరు

హిందూత్వ అతివాదుల్లో మితవాది వాజ్ పేయి

వాజ్‌పేయ్: బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర, మూడు దఫాలు ప్రధానిగా

వాజ్‌పేయ్: 24 ఏళ్ల తర్వాత ఫోఖ్రాన్ అణు పరీక్షలతో సత్తా

కార్గిల్ యుద్దం: పాక్‌కు చుక్కలు చూపించిన వాజ్‌పేయ్

ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేసిన వాజ్ పేయి (వీడియో చూడండి)

పార్లమెంట్‌పై ఉగ్రదాడి: తృటిలో తప్పించుకొన్న వాజ్‌పేయ్, అద్వానీ

వాజ్ పేయి జీవితంలో అత్యంత చేదు ఘటన ఇదే

వాజ్ పేయి అభిమాన నేత ఎవరంటే...

అటల్ జీ పెళ్లెందుకు చేసుకోలేదు...?

ఒక్క ఓటుతో కుప్పకూలిన వాజ్‌పేయ్ సర్కార్

 

 

Follow Us:
Download App:
  • android
  • ios