Asianet News TeluguAsianet News Telugu

టీవీ 9 ఫోర్జరీ కేసు: రవిప్రకాష్ కు మరోసారి పోలీసుల నోటీస్

సినీనటుడు శొంఠినేని శివాజీ, టీవీ 9 ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎంకేవీఎన్‌ మూర్తికి కూడా ఇంతకుముందు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూర్తి శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. రవిప్రకాశ్‌ మాత్రం విచారణకు గైర్హాజరయ్యారు.

TV9 Controversy: Ravi Prakash issued notice once again
Author
Hyderabad, First Published May 11, 2019, 10:11 PM IST

హైదరాబాద్‌: టీవీ 9 వాటాల వ్యవహారంలో మాజీ సిఈవో రవిప్రకాష్ కు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు రెండోసారి నోటీసు జారీ చేశారు. సొంత ప్రయోజనం కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసులో రవిప్రకాశ్‌కు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. 

ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో సూచించారు. సినీనటుడు శొంఠినేని శివాజీ, టీవీ 9 ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎంకేవీఎన్‌ మూర్తికి కూడా ఇంతకుముందు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూర్తి శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. రవిప్రకాశ్‌ మాత్రం విచారణకు గైర్హాజరయ్యారు. 

వ్యక్తిగత విచారణకు మరో పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసులను కోరినట్టు సమాచారం.శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది 

టీవీ9 సీఈవో, డైరెక్టర్‌ పదవి నుంచి రవిప్రకాశ్‌ను తొలగిస్తున్నట్లు అలందా మీడియా గ్రూపు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

టీవీ9లో డేటా చోరీ: పోలీసు విచారణకు రవిప్రకాష్, శివాజీ డుమ్మా

కొత్త యాజమాన్యానికి రవి ప్రకాష్ బహిరంగ లేఖ

అసలు జరిగిందిదీ, అందుకే రవిప్రకాశ్‌ను తప్పించాం: టీవీ9 కొత్త మేనేజ్‌మెంట్

రవిప్రకాష్ ఔట్: టీవీ9 సీఈఓగా మహేంద్ర మిశ్రా

టీవీ9 వివాదం: రవి ప్రకాష్ స్థానంలో కొత్త సీఈఓను ప్రకటించే ఛాన్స్

టీవీ9 వివాదం: పోలీసుల విచారణకు హాజరైన ఫైనాన్స్ డైరెక్టర్

రెండో రోజూ టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు

ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?

రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు

రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు

Follow Us:
Download App:
  • android
  • ios