తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రముఖ పార్టీల మధ్య  ప్రచార యుద్దమే కాదు మాటల యుద్దం కూడా ఎక్కువయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్. రమణ కేసీఆర్ పై విమర్శల  వర్షం కురిపించారు. 

తాను ప్రకటించిన పథకాలపైనే కేసీఆర్ కు నమ్మకం లేకుండా పోయిందని రమణ ఆరోపించారు. తెలంగాణలో కంటి వెలుగు పథకాన్ని అమలుచేసి  ప్రజలకు ఇక్కడ కంటి పరీక్షలు చేయిస్తూ ఆయన మాత్రం డిల్లీకి వెళ్లి  వైద్యం చేయించుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీన్ని బట్టే కేసీఆర్ కు తాను ప్రకటించిన పథకం పై నమ్మకం లేదని తెలుస్తోందని రమణ ఎద్దేవా చేశారు. 

మహాకూటమిని చూసి కేసీఆర్ భయపడిపోతున్నారని అందువల్లే ప్రధాని మోదీని కలవడానికి డిల్లీకి వెళ్లారని ఆరోపించారు. మోదీ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టాడని విమర్శించారు. 

కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నందుకు తాను గర్వపడుతున్నాని రమణ తెలిపారు. ఆయనతో తనకు మంచి సత్సంబంధాలున్నాయని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ది కోసం జీవన్ రెడ్డి ఎప్పుడూ తాపత్రయపడుతుంటాడని రమణ ప్రశంసించారు.  

మరిన్ని వార్తలు

ఆ రెండు సీట్ల కోసమే ప్రజాకూటమి పోటీపడితే కేసీఆర్‌కు ఉలుకెందుకో: ఎల్ రమణ

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

నిజామాబాద్ ప్రజా ఆశిర్వాద సభలో కేసీఆర్ (పోటోలు)

టీఆర్ఎస్ కు ఈసీ షాక్

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్