తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ విర్రవీగుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని టిటిడిపి అధ్యక్షులు ఎల్. రమణ అన్నారు. కానీ ఇప్పుడు అతడికి వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ఒప్పుకోక మళ్లీ 110 సీట్లు తమకు వస్తాయని...మిగతా  7 తమ ప్రెండ్లీ  పార్టీ ఎంఐఎం కు వస్తాయని కేసీఆర్ చెబుతున్నారు. ఆయనకు అంత నమ్మకం వుంటే మిగతా రెండు సీట్ల కోసం పోరాడుతున్న ప్రజాకూటమిని చూసి ఎందుకు ఉలిక్కి పడుతున్నారని రమణ ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబ కలవరపాటుకు కారణాలేంటని ప్రశ్నించారు. 

89 మందికి పాతవారికి, 16 మంది కొత్త వారిని మొత్తం 105 మంది అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించగా అందులో చాలామంది  తిరస్కరణకు గురవుతున్నారని రమణ పేర్కొన్నారు. ఏకంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలోనే మహిళలు టీఆర్ఎస్  ను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టినట్లు రమణ తెలిపారు.  50 రోజుల్లో వంద ఆశిర్వాద సభలు నిర్వహిస్తానని  ప్రకటించిన కేసీఆర్ కేవలం 4 సభలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కొంగర కలాస్ సభలోనే కేసీఆర్ కు అసలు విషయం అర్థమైందన్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు టీఆర్ఎస్‌కు 20 సీట్లే వస్తాయని రిపోర్టు ఇచ్చినట్లు రమణ తెలిపారు. 


పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ అటాక్ చేసినట్లే తెలంగాణ ప్రతిపక్షాలపై ఆయన సర్జికల్ అటాక్ చేస్తున్నారని రమణ మండిపడ్డారు. మిగులు బడ్జెట్ లో వున్న తెలంగాణను కేసీఆర్ 2 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు. ఈ నాలుగేళ్లలో మొత్తం 8 లక్షల కోట్ల ఖర్చు చేశారని ఆ ఫలితాలు ఎక్కడపోయాయని ప్రశ్నించారు. కేసీఆర్ గ్రాఫ్ 2 శాతానికి పడిపోయిందని రమణ తెలిపారు. 

ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల్లో ఉద్వేగంగా ఉవ్వెత్తున లేపి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తవ్వా గరం హో గయా రోటీ బనాలే అన్నట్లు టీఆర్ఎస్ వ్యవహరించిదన్నారు. అధికారంలోకి వచ్చాక నలుగురి గుప్పిట్లో నాలుగు కోట్ల మంది  ప్రజల ధనాన్ని పెట్టారని కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. 

సీఎం నియోజకవర్గం గజ్వెల్‌లో రైతాంగం రోడ్డుపై వచ్చి మాట్లాడితే రక్తం వచ్చేలా కొట్టించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ది విమర్శించారు. అలాగే ఖమ్మంలో గిట్టుబాటు ధరకోసం పోరాడితే గిరిజన రైతులకు బేడీలు వేశారని అన్నారు. ఇక  హైదరాబాద్ లోని ధర్నా చౌక్ ను నగరం బైట పడేసి ప్రజలు తమ సమస్యలపై పోరాడకుండా చేయారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

నిజామాబాద్ ప్రజా ఆశిర్వాద సభలో కేసీఆర్ (పోటోలు)

టీఆర్ఎస్ కు ఈసీ షాక్

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్