Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ వ్యూహం: డీఎస్ లోటు సురేష్ రెడ్డితో భర్తీ

టీఆర్ఎస్ ఎంపీ  డీ.శ్రీనివాస్  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అదే జిల్లా నుండి  కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. 

Trs plans shock to mp d.srinivas
Author
Hyderabad, First Published Sep 7, 2018, 4:58 PM IST


హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ  డీ.శ్రీనివాస్  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అదే జిల్లా నుండి  కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. డీఎస్ పార్టీని వీడినా  తమకు నష్టం లేదనే సంకేతాలను ఇచ్చింది. 

రెండు మాసాల క్రితం  ఎంపీ   డీ.శ్రీనివాస్‌పై  నిజామాబాద్ జిల్లాకు చెందిన  టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు  కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని డీఎస్‌పై నాలుగు పేజీల ఉత్తరాన్ని కేసీఆర్‌కు పంపారు.

ఈ ఫిర్యాదుపై రెండు రోజుల క్రితం డీఎస్ నిజామాబాద్‌లో స్పందించారు. తనను సస్పెండ్ చేయాలని  టీఆర్ఎస్ ను డిమాండ్ చేశారు.తనపై చేసిన ఆరోపణల తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని  కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.  ఈ ప్రచారం నేపథ్యంలోనే  డీఎస్‌పై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఫిర్యాదులు చేశారనే ఆరోపణలు కూడ లేకపోలేదు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డిని టీఆర్ఎస్  తమ వైపుకు లాగింది.  సెప్టెంబర్ 7వ తేదీన సురేష్ రెడ్డితో మంత్రి కేటీఆర్  సమావేశమయ్యారు.  టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు. టీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన సంసిద్దతను వ్యక్తం చేశారు.  సెప్టెంబర్ 12 వ తేదీన కేసీఆర్ సమక్షంలో సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు.

ఇదిలా ఉంటే  డీఎస్ చేరితే  టీఆర్ఎస్‌కు నష్టం జరుగుతోందనే భావన ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఆపరేషన్ ఆకర్ష్ కు టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది.  ఇందులో భాగంగానే  సురేష్ రెడ్డికి వల వేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు  డీఎస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలను కూడ  టీఆర్ఎస్ తమ వైపుకు లాక్కొనే ప్రయత్నం చేస్తోందని సమాచారం.  నిజామాబాద్ జిల్లాతో పాటు  ఇతర జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతలను కూడ తమ వైపుకు ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మరో ఐదుగురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడ టీఆర్ఎస్ లో చేరేందుకు ప్లాన్ చేసుకొంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆ కాంగ్రెస్ నేతలు  ఎవరనేది మాత్రం  ఇంతవరకు స్పష్టత రాలేదు.
 

ఈ వార్తలు చదవండి

దురదృష్టకరం: కేసీఆర్‌కు సీఈసీ చురకలు

బాబుతో చర్చలు: టీడీపీతో పొత్తుపై తేల్చేసిన ఉత్తమ్

టీఆర్ఎస్ లో టిక్కెట్ల చిచ్చు: పక్క చూపులు చూస్తున్న అసంతృప్తులు

Follow Us:
Download App:
  • android
  • ios