టీడీపీతో పొత్తు పెట్టుకొంటామని పీసీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ 8వ తేదీన  హైద్రాబాద్‌లో చంద్రబాబునాయుడుతో చర్చలు చేస్తామని  ఆయన ప్రకటించారు. 

హైదరాబాద్: టీడీపీతో పొత్తు పెట్టుకొంటామని పీసీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ 8వ తేదీన హైద్రాబాద్‌లో చంద్రబాబునాయుడుతో చర్చలు చేస్తామని ఆయన ప్రకటించారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌ను అధికారానికి దూరం చేయాలంటే ఇతర పార్టీలతో పొత్తులు అవసరమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు తమతో కలిసి రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుతున్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

హరికృష్ణ దశదినకర్మలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైద్రాబాద్ కు రానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చంద్రబాబునాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. అయితే హైద్రాబాద్‌కు చంద్రబాబునాయుడు వస్తున్నందున ఆయనతో చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

సీపీఐతో పాటు కేసీఆర్ నియంత పాలనను అంతమొందించేందుకు ఇతర పార్టీలు కలిసిరావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. గెలిచే అభ్యర్థులకు ఇంటికే భీ ఫాం ను పంపనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

టిక్కెట్ల కోసం గాంధీభవన్ కు ఢిల్లీకి తిరగాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీగా ఆయన అభివర్ణించారు..