దురదృష్టకరం: కేసీఆర్‌కు సీఈసీ చురకలు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 7, Sep 2018, 4:28 PM IST
chief election commissioner rawat reacts on kcr comments
Highlights

ఎన్నికల సంఘం కాకుండా  ఎవరూ కూడ  ఎన్నికల తేదీలను ప్రకటించడం దురదృష్టకరమని  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్  ఓపీ రావత్  చెప్పారు. 

హైదరాబాద్: ఎన్నికల సంఘం కాకుండా  ఎవరూ కూడ  ఎన్నికల తేదీలను ప్రకటించడం దురదృష్టకరమని  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్  ఓపీ రావత్  చెప్పారు. 

శుక్రవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై వారం రోజుల్లో  నిర్ణయం తీసుకొంటామని ఆయన ప్రకటించారు.

ఎన్నికల తేదీలను  నేతలనే ప్రకటించడం దురదృష్టకరమన్నారు.  రాష్ట్ర ఎన్నికల అధికారి నుండి నివేదిక వచ్చిన తర్వాత  ఎన్నికల నిర్వహణ గురించి నిర్ణయం తీసుకొంటామని ఆయన ప్రకటించారు.

అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్ఎస్ భవనంలో మీడియా సమావేశంలో కేసీఆర్  చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమిషనర్ రావత్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేసీఆర్ ప్రకటించారు. 

ఈ మేరకు తాను, రాజీవ్ శర్మ  ఎన్నికల సంఘం అధికారులతో కూడ చర్చించిన విషయాన్ని కూడ ఆయన మీడియా సమావేశంలో ప్రస్తావించారు.ఈ వ్యాఖ్యలపై  ఎన్నికల కమిషనర్ రావత్ స్పందించారు. ఈ వ్యాఖ్యలను దురదృష్టకరమైనవిగా ఆయన ప్రకటించారు.  ఈ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. 


నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.  అయితే రాష్ట్రం నుండి వచ్చే నివేదికల ఆధారంగా అన్ని రకాల సౌకర్యాలు ఉంటే నాలుగు రాష్ట్రాల ఎన్నికల కంటే ముందే ఎన్నికలను నిర్వహించనున్నట్టు చెప్పారు. అయితే  అపద్ధర్మ ప్రభుత్వం ఆరు మాసాల పాటు కూడ కొనసాగాల్సిన అవసరం కూడ లేదన్నారు రావత్. 

ఈ వార్తలు చదవండి

బాబుతో చర్చలు: టీడీపీతో పొత్తుపై తేల్చేసిన ఉత్తమ్

టీఆర్ఎస్ లో టిక్కెట్ల చిచ్చు: పక్క చూపులు చూస్తున్న అసంతృప్తులు

loader