హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. టీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపేందుకు పార్టీలోని కొందరు కాచుకుని ఉన్నారంటూ ఆరోపించారు. తాను వెళ్లాలనుకుంటే ధైర్యంగా రాజీనామా చేసి వెళ్తానని షకీల్ అహ్మద్ స్పష్టం చేశారు. 

బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కలిస్తే తప్పేంటని నిలదీశారు. రాజకీయాలకు అతీతంగా ఆయన్ను కలిస్తే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

గతంలో తాను బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినట్లు గుర్తు చేశారు. పార్టీ మారాలనే ఆలోచన తనకు లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ధర్మపురి అరవింద్ కుటుంబానికి తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ సైతం తమ ఇంటికి వస్తూ ఉంటారని ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న ఊహాగానాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ఎమ్మెల్యే కోరారు. 

ఈ వార్తలు కూడా చదవండి

యూటర్న్: బిజెపిలో చేరేది లేదన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్

టీఆర్ఎస్ లో గుర్తింపు లేదు, రాజీనామాకు సిద్దం: షకీల్ సంచలనం

బిజెపి ఎంపీ ఆరవింద్ తో టీఆర్ఎస్ ఎమ్మల్యే షకీల్ భేటీ: గులాబీ పార్టీలో కలకలం

టీఆర్ఎస్ లో అసమ్మతి: బిజెపి భయంతో రంగంలోకి కేటీఆర్

పార్టీకి ఓనర్లు ఉండరు, నేనే ఓనర్ అంటే ఎలా : కేటీఆర్ వార్నింగ్