తెలంగాణలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఈ ప్రచారంలో భాగంగా  నాయకులు వివాదాస్పద  వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా ఎన్నికల నిబంధనలను అతిక్రమించే విధంగా నాయకుల ప్రసంగాలు ఉంటే తమ దృష్టికి తీసురావాలంటూ ఇప్పటికే ఈసీ ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో బిజెపి నేత పరిపర్ణానంద ఓటర్లను ప్రలోభపెట్టేలా ప్రసంగించారంటూ కొందరు టీఆర్ఎస్ నాయకులు ఈసీకి పిర్యాదు చేశారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, దండె విఠల్, అడ్వకేట్ ఉపేందర్ లు ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌ ను కలిశారు. ఇటీవల నల్గొండ జిల్లాలో జరిగిన భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సభలో పరిపూర్ణానంద ప్రసంగం అభ్యంతకరంగా ఉందంటూ వారు ఈసీకి పిర్యాదు చేశారు. ఓటుకు రూ.200 ఇస్తే వేల ఓట్లు పడతాయంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం పరిపూర్ణానంద చేశారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇలా ఎన్నికల నిబంధనలను అతిక్రమించేలా ప్రసంగించిన పరిపూర్ణానందపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు రజత్ కుమార్ ను కోరారు. అలాగే ఇలా ఓటర్లను ప్రలొబాలకు గురిచేసే వారిపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు రజత్ కుమార్ కు సూచించారు. 

మరిన్ని వార్తలు

పరిపూర్ణానంద కారులో పోలీస్ తనిఖీలు (వీడియో)

పరిపూర్ణానంద పోటీపై క్లారిటీ ఇచ్చిన పురందేశ్వరి

నేను రాజకీయాల్లోకి ఎందుకొచ్చానంటే...: పరిపూర్ణానంద (వీడియో)

తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానంద:జూబ్లీహిల్స్ నుంచి పోటీ