Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానంద:జూబ్లీహిల్స్ నుంచి పోటీ

 బీజేపీ జాతీయ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థిగా శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని బరిలోకి దింపనుంది. అందులో భాగంగానే పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరినట్లు సమాచారం. గత కొంతకాలంగా పరిపూర్ణానంద బీజేపీతో సత్సమ సంబంధాలు నెరపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. 

telangana bjp cm candidate swamy paripurnananda
Author
Delhi, First Published Oct 19, 2018, 5:39 PM IST

ఢిల్లీ: బీజేపీ జాతీయ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థిగా శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని బరిలోకి దింపనుంది. అందులో భాగంగానే పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరినట్లు సమాచారం. గత కొంతకాలంగా పరిపూర్ణానంద బీజేపీతో సత్సమ సంబంధాలు నెరపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. 

ఈనెల 8న అమిత్ షా తో సమావేశమైన పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరికపై చర్చించారు. ఈనెల 19న బీజేపీలో చేరనున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అనుకున్నట్లుగానే శుక్రవారం అమిత్ షా సమక్షంలో పరిపూర్ణానంద స్వామి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

అంతకుముందు రాంమాధవ్, అమిత్ షా పరిపూర్ణానంద స్వామితో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయాలు, తెలంగాణలో పరిపూర్ణానంద స్వామి పోటీపై చర్చించారు. ఆంధ్రా ఓటర్లు అత్యధికంగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజక వర్గం నుంచి పరిపూర్ణానంద స్వామి పోటీ చెయ్యనున్నట్లు తెలుస్తోంది.  

మరోవైపు తాను ఏమీ ఆశించకుండా పార్టీలో చేరానని బీజేపీ సిద్ధాంతాలను నలుమూలల వ్యాపింప చెయ్యడమే తన లక్ష్యమని చెప్పారు. బీజేపీ కోసం 24 గంటలు పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక మార్గంలో ఎంత త్రికరణశుద్ధిగా పనిచేశానో బీజేపీ కోసం అంతే స్థాయిలో పని చేస్తానన్నారు. తనకు ముందు, వెనకా ఎవరూ లేరని తానొక సాధువునని చెప్పుకొచ్చారు. 

దేశంలో ఎక్కడ అవసరమైతే అక్కడ పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అమిత్ షా నేతృత్వంలో మార్గదర్శకత్వంలో 24 గంటలు పని చేస్తానని వాగ్దానం చేశారు. తెలుగు ప్రజలు తనకు ఎంతో ఇచ్చారన్నారు. బీజేపీ కుటుంబంలో తాను కూడా భాగమవ్వడం ఎంతో సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ పని చేస్తోందని పరిపూర్ణానంద అన్నారు.

సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో చేరానని పరిపూర్ణానంద తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాం మాధవ్ నేతృత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీలో చేరిన పరిపూర్ణానంద స్వామి

పొలిటికల్ ఎంట్రీపై స్వామి పరిపూర్ణానంద ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీలోకి పరిపూర్ణానంద స్వామి

హైదరాబాద్ చేరుకున్న స్వామి పరిపూర్ణానంద ధర్మజ్వాల ర్యాలీ

పరిపూర్ణానందపై బహిష్కరణ ఎత్తివేత.. నేడు నగరానికి రాక

రాజకీయాల్లోకి పరిపూర్ణానంద స్వామి..?

 

Follow Us:
Download App:
  • android
  • ios