Asianet News TeluguAsianet News Telugu

నేను రాజకీయాల్లోకి ఎందుకొచ్చానంటే...: పరిపూర్ణానంద (వీడియో)

బడుగు,బలహీన వర్గాల ప్రజల జీవితాలు మారాలంటే కేవలం తన ప్రవచనాలు సరిపోవని గ్రహించి రాజకీయాల్లోకి వచ్చినట్లు శ్రీపీఠం అధినేత స్వామి పరిపూర్ణానంద వివరించారు. ఆధ్యాత్మిక శక్తికి రాజకీయ శక్తి తోడయితే మంచి ఫలితాలుంటాయని భావించానని...అందుకోసం బిజెపి పార్టీ సరైందని భావించి ఇందులో చేరినట్లు వెల్లడించారు. దేశాన్ని మహాభారతం చేయడానికి తాను అద్యాత్మికంగా, రాజకీయంగా పనిచేయనున్నట్లు పరిపూర్ణానంద పేర్కొన్నారు. 
 
paripurnananda swamy visits bagyalaxmi temple in charminar
Author
Charminar, First Published Oct 24, 2018, 7:35 PM IST

బడుగు,బలహీన వర్గాల ప్రజల జీవితాలు మారాలంటే కేవలం తన ప్రవచనాలు సరిపోవని గ్రహించి రాజకీయాల్లోకి వచ్చినట్లు శ్రీపీఠం అధినేత స్వామి పరిపూర్ణానంద వివరించారు. ఆధ్యాత్మిక శక్తికి రాజకీయ శక్తి తోడయితే మంచి ఫలితాలుంటాయని భావించానని...అందుకోసం బిజెపి పార్టీ సరైందని భావించి ఇందులో చేరినట్లు వెల్లడించారు. దేశాన్ని మహాభారతం చేయడానికి తాను అద్యాత్మికంగా, రాజకీయంగా పనిచేయనున్నట్లు పరిపూర్ణానంద పేర్కొన్నారు. 

బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న పరిపూర్ణానంద పాతబస్తీ చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి  ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి స్వామి ప్రత్యేక పూజలు చేశారు.  

అనంతరం నేరుగా తెలంగాణ బిజెపి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి రావడంతో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆయన ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ...  పలు సందర్భాల్లో బస్తీల్లో, మత్స్యకార గ్రామాల్లో సందర్శించినపుడు వారి దుర్భర జీవనాన్ని చూసి చలించిపోయేవాడినని అన్నారు. వారి జీవితాలను బాగుచేయడానికే రాజకీయాల్లోకి రావాలనుకున్నానని...అందుకోసం చాలా ఆలోచించి బిజెపిలో చేరినట్లు స్వామి వివరించారు. 

తన తల్లిదండ్రులు, గురువుల సూచనల మేరకే రాజకీయ రంగప్రవేశం చేసినట్లు వెల్లడించారు. తనకు రాజకీయంగా గాడ్ ఫాదర్ ఎవరూ లేరని...ఆ దేవుడినే తన గాడ్ ఫాదర్ గా భావిస్తానని పరిపూర్ణానంద వెల్లడించారు.  

వీడియో

Follow Us:
Download App:
  • android
  • ios