హైదరాబాద్: టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇరునేతల మధ్య నెలకొన్న మాటల యుద్ధం ఇప్పుడు ఈసీ వరకు వెళ్లింది. ఒంటేరుపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. 

హరీష్ రావుపై ఒంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన ఆరోపణలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన  కింద వస్తుందని ఈసీకి వివరించారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఒంటేరు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిబంధనలు విధించాలని ఈసీని కోరారు.
 
ఇకపోతే ఇటీవలే మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నేత ఒంటేరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మామను ఓడించాలని హరీష్ రావు తనకు ఫోన్ చేసి చెప్పారని, ఈ విషయాన్ని తాను ప్రమాణం చేసి చెబుతున్నానంటూ స్పష్టం చేశారు. 

అంతేకాదు హరీష్ రావు తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని, త్వరలో కాంగ్రెసు కండువా కప్పుకుంటారని కూడా చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ లో అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకుందన్న ఒంటేరు హరీష్ తనకు అన్ నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి మా మామను ఓడించాలని వేడుకున్నట్లు చెప్పారు. 

కేసీఆర్ ఉన్నంత వరకు తనకు రాజకీయ జీవితం ఉండదని హరీష్ రావు అన్నారని ఒంటేరు చెప్పారు. ఎన్నికల్లో కేసీఆర్ ను ఒడించేందుకు అవసరమైతే ఆర్థిక సాయం కూడా చేస్తానని హరీష్ తనతో అన్నారని తెలిపారు. అయితే తనకు అవినీతి సొమ్ము అక్కర్లేదని చెప్పానన్నారు. 

14 ఏళ్లు కష్టపడ్డానని పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కేసీఆర్ నా బావమరిదికి  అన్నీ చేతుల్లో పెడుతున్నారని హరీష్ మదనపడుతున్నట్లు తెలిపారు. తాను ఎక్కడికైనా వచ్చి మంత్రి హరీష్ వ్యాఖ్యలపై ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రతాప రెడ్డి తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?