మహాకూటమి తరుపన టీడీపీ అభ్యర్థిగా కూకట్ పల్లి నియోజకవర్గానికి నందమూరి సుహాసిని నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అదే సీటుకి టీఆర్ఎస్ నుంచి మాధవరం కృష్ణారావు పోటీ చేస్తున్నారు.

నందమూరి సుహాసిని తనకు సోదరిలాంటిదని టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు అన్నారు. మహాకూటమి తరుపన టీడీపీ అభ్యర్థిగా కూకట్ పల్లి నియోజకవర్గానికి నందమూరి సుహాసిని నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అదే సీటుకి టీఆర్ఎస్ నుంచి మాధవరం కృష్ణారావు పోటీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తామని కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. సుహాసిని తనకు సోదరిలాంటిదని చెప్పారు. ఆమెకు కూకట్ పల్లి టికెట్ కాకుండా రాజమండ్రి ఇచ్చి ఉంటే బాగుంటుందని, అక్కడ ఆమె కచ్చితంగా గెలిచేవారని ఆయన అభిప్రాయపడ్డారు.

మాధవరం కృష్ణారావు గతంలో టీడీపీ అభ్యర్థి కాగా.. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలోనే సుహాసిని ఆయన సోదరిలా భావించి పైవ్యాఖ్యలు చేశారు. అయితే.. ఓటమి భయంతోనే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. 

మరో వైపు కూకట్‌పల్లి బీజేపీ అభ్యర్థిగా మాధవరం కాంతారావు నామినేషన్ దాఖలు చేశారు. అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని, మహాకూటమి అనేది లేనేలేదని కాంతారావు అన్నారు. దేశంలో బీజేపీ చేసిన అభివృద్ధి, నిజాయితీ తనను గెలిపిస్తుందన్నారు.

read more news

సుహాసినీ కోసం.. రంగంలోకి ఎన్టీఆర్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని

సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య

ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని

బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి

మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి