దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్.. మూడు రోజుల పాటు మూసివేత.. ఎప్పటినుంచి ఎప్పటివరకంటే...

హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీవరకు రాకపోకలు బంద్ కానున్నాయి. 

Traffic ban on Durgam Lake Cable Bridge, to be Closed for 6th april to 10th april - bsb

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద పోలీసు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు  విధించారు. కేబుల్ బ్రిడ్జి మీద మూడు రోజుల పాటు రాకపోకలు నిలిపి వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు  జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల ఆరవ తేదీ అంటే గురువారం అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అంటే సోమవారం ఉదయం వరకు కేబుల్ బ్రిడ్జి మూసివేస్తున్నట్లుగా తెలిపారు. దీనికి కారణం కూడా తెలిపారు.

వాహనదారులకు అలర్ట్.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బండి ఆపితే రూ.2 వేల ఫైన్

కేబుల్ బ్రిడ్జిని కాలానుగుణంగా ఇంజనీర్లతో తనిఖీ చేయించాల్సి ఉందని.. ఈ మేరకు కేబుల్ బ్రిడ్జి నిర్వహణ మాన్యువల్ లో ఉందని.. ఈ క్రమంలోనే.. కేబుల్ బ్రిడ్జి పటిష్టతను గుర్తించేందుకు భారీబరువు ఉన్న క్రేన్లను బ్రిడ్జి మీద ఉంచాల్సి ఉంటుందని తెలిపారు. దాంతోనే ట్రాఫిక్ ను మూసివేస్తున్నట్లుగా  జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని.. నాలుగు రోజులపాటు వాహనదారులు, పాదచారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని కమిషనర్ సూచించారు. కేబుల్ బ్రిడ్జి వచ్చిన తర్వాత ట్రాఫిక్ విషయంలో కాస్త వెసులుబాటు కలిగిన సంగతి తెలిసిందే.  

ఇప్పుడు నాలుగు రోజులపాటు కేబుల్ బ్రిడ్జి మీద రాకపోకలు నిలిపివేస్తే.. ట్రాఫిక్ ను ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పటికే పోలీసులు కసరత్తులు చేశారు. ఆ నాలుగు రోజులపాటు వివిధ మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్ళించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే రోడ్ నెంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్ ను రెండు మార్గాల్లో మళ్ళించనున్నామని తెలిపారు. ఇక ఐకియా రోటరీ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్లే ట్రాఫిక్ ను కూడా ఇదే రీతిన రెండు మార్గాల్లో మళ్ళించనున్నారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో  వెళ్లడానికి ప్రయత్నించాలని..  సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios