వాహనదారులకు అలర్ట్.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బండి ఆపితే రూ.2 వేల ఫైన్
HYDERABAD: హైదరాబాద్ నగరంలో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు శని, ఆదివారాల్లో ప్రజలు భారీగా తరలివస్తుంటారు. ఇది టూరిస్టు ప్లేస్ గా మారింది. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన వారు ఫొటోలు దిగడంతో పాటు వాహనాల్లో వెళ్తున్న వారు సైతం తమ వాహనాలను ఆపి సెల్పీలు దిగుతున్నారు. ఇదివరకు కేబుల్ బ్రిడ్జిపై వాహనాల పార్కింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు.
Durgam Cheruvu cable bridge: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీ దిగేందుకు వాహనాలు ఆపి పార్కింగ్ చేస్తే రూ.2 వేల భారీ జరిమానా విధిస్తారు. ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్ జామ్ లతో సతమతమవుతున్న మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు గతంలో ఉన్న రూ.200 జరిమానా మొత్తాన్ని 10 రెట్లు పెంచాలని నిర్ణయించారు. దీంతో కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు ఆపితే 2000 రూపాయల జరిమానా పడుతుందని అధికారులు చెబుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ నగరంలో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు శని, ఆదివారాల్లో ప్రజలు భారీగా తరలివస్తుంటారు. ఇది టూరిస్టు ప్లేస్ గా మారింది. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన వారు ఫొటోలు దిగడంతో పాటు వాహనాల్లో వెళ్తున్న వారు సైతం తమ వాహనాలను ఆపి సెల్పీలు దిగుతున్నారు. ఇదివరకే కేబుల్ బ్రిడ్జిపై వాహనాల పార్కింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు. కానీ దీనిని పెద్దగా పట్టించుకోకపోవడంతో జరిమానాను రూ.200 నుంచి 2000 వేలకు పెంచారు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత, వారాంతాల్లో కేబుల్ బ్రిడ్జి వెంబడి గస్తీ పెంచామనీ, ఆరు వరుసల వంతెనపై చాలా మంది పిట్ స్టాప్ చేస్తారని పోలీసులు తెలిపారు. ఫలితంగా వాహనాల పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
కొందరు బ్రిడ్జిపై సెల్ఫీలు దిగుతుంటే మరికొందరు స్వచ్ఛమైన గాలిని పొందడానికి ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఇప్పటి వరకు పోలీసు అధికారులు సైరన్ మోగించి బ్రిడ్జిపై పార్కింగ్ చేసిన వారిని తరిమికొట్టినా వారందరినీ అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బ్రిడ్జిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు అక్రమ పార్కింగ్ లపై చర్యలు తీసుకుంటున్నాయి. వంతెన పక్కన నిషేధిత ప్రాంతాల్లో ఆగిన బైకులు, నాలుగు చక్రాల వాహనాల నంబర్ ప్లేట్లను కెమెరాలు ఆటోమేటిక్ గా బంధిస్తాయనీ, అక్కడికక్కడే చలాన్లు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా సాయంత్రం రద్దీ సమయాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు జరిమానా మొత్తం ఎక్కువగా ఉంటుందనీ, ఈ బెడదను అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నడక మార్గం, కేబుల్ వంతెన మంచి వీక్షణను అందించే పార్కు కూడా ఉంది. ప్రజలు వంతెన రాకపోకలను ఇలా పార్కింగ్ లు చేస్తూ అడ్డుకోవద్దని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే, పాదచారులు ఫుట్ పాత్ లను మాత్రమే ఉపయోగించాలనీ, ప్రధాన వంతెనపై గుంపులుగా ఉండొద్దని అధికారులు కోరారు. కాగా, ఐటీసీ కోహెనూరు లేదా ఇనార్బిట్ మాల్ ను ఆనుకుని ఉన్న రోడ్డుపై పార్కింగ్ స్థలాలను ఉపయోగించుకుంటే వంతెనకు అంతరాయం కలగకుండా చూసుకోవచ్చని స్థానికులు సూచిస్తున్నారు.