Asianet News TeluguAsianet News Telugu

Top Stories : తెలంగాణలో కాంగ్రెస్సే, నాగార్జునసాగర్ పై ఏపీ వివాదం, అవుకు రెండో టన్నెల్ ప్రారంభం...

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. విజయం తమదే అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల వేళ సాగర్ జలాల కోసం ఘర్షణకు దిగిన ఏపీ.. ఇలాంటి వార్తా కథనాల సమాహారం.. టాప్ టెన్ స్టోరీస్ ఇవి... 

Top Stories : Congress in Telangana, AP controversy over Nagarjunasagar, opening of the second tunnel to Avu, India's defense system is getting stronger  - bsb
Author
First Published Dec 1, 2023, 7:58 AM IST

కాంగ్రెస్ దే హవా…

దేశవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం చివరి విడతగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. వీటిలో రెండు రాష్ట్రాలు కాంగ్రెస్, రెండు రాష్ట్రాలు బిజెపి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ కమలం దక్కించుకోగా.. ఛత్తీస్గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ దక్కించుకుంటుందని ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక ఈ రెండు కాకుండా మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్,  జోరో పీపుల్స్ మూమెంట్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీల తర్వాతే కాంగ్రెస్, బిజెపిలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ఈనాడు ‘తెలంగాణలో కాంగ్రెస్ కే మొగ్గు’ అనే పేరుతో.. ఆంధ్రజ్యోతి ‘కాంగ్రెస్ కు అనుకూలం’  పేరుతో ఎగ్జిట్ పోల్స్ తో కలిపిన కథనాలను ప్రచురించాయి. 

Telangana Exit polls 2023: తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా

బద్దకించిన పట్టణవాసులు.. ఓటింగ్ కు దూరం..

తెలంగాణలో గురువారం నాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా  చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎప్పటిలాగే పట్టణాల్లో ముఖ్యంగా హైదరాబాదులో తక్కువ ఓటింగ్ నమోదవడం. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కాగా.. పట్టణాలు నగరాలు మాత్రం ఓటింగ్ ను లైట్ తీసుకున్నాయి. గురువారం రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 70.66శాతం  పోలింగ్ నమోదయ్యిందని  ఎన్నికల అధికారులు చెబుతున్నారు. హైదరాబాదులో కేవలం 46.56% మాత్రమే పోలింగ్ నమోదయింది. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ఏ ఏ జిల్లాలో ఎంత  పోలింగ్ నమోదయింది… ఘర్షణలు,  ఓటింగ్ ప్రక్రియలో తలెత్తిన సమస్యలు వీటన్నింటితో ఓ సమగ్ర కథనాన్ని బ్యానర్ ఐటమ్ గా….‘ పట్నం బద్ధకించింది.. పల్లె ఓటెత్తింది’  అనే పేరుతో ఈనాడు ప్రచురించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 66.09 శాతం పోలింగ్

ఎన్నికల్లో సునామీలా ఫలితాలు … రేవంత్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల మీద పోలింగ్ అనంతరం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో ఫలితాలు సునామీలా ఉండబోతున్నాయని కాంగ్రెసే అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు తమకు ఐదేళ్లపాటు అవకాశం  ఇచ్చారన్నారు. పోలింగ్ అనంతరం రేవంత్ రెడ్డి కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. ‘ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల్లో ఈసారి సునామీ చూశారని.. బిఆర్ఎస్ కు 25కు మించి ఒక్క సీటు కూడా ఎక్కువ రాదని’.. చెప్పుకొచ్చారు. ప్రతి ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ విజయాన్నే చెబుతుందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాంట్లో మెజారిటీలో కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ, అంతిమంగా కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందన్నారు. ఫలితాలు అనుకూలంగా లేకపోవడం వల్లే కెసిఆర్ పోలింగ్ ముగిసిన తర్వాత మీడియా ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. గత రెండు విడతల్లో పోలింగ్ ముగిసిన వెంటనే కెసిఆర్ మీడియాతో మాట్లాడే వారిని గుర్తు చేశారు. మరోవైపు మంత్రి కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ చేసిన వారిని బెదిరిస్తున్నారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతారా? అంటూ ప్రశ్నించారు… దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని.. ‘అధికారంలోకి వస్తున్నాం’ అనే పేరుతో ఈనాడు.. ‘కాంగ్రెస్ సునామి’  పేరుతో ఆంధ్రజ్యోతిలు మెయిన్ పేజీలో ప్రచురించాయి.

కేసీఆర్‌ ఓటమి ఖాయం..

మేమే గెలవబోతున్నాం..కేటీఆర్

తెలంగాణలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ మూడో తేదీన ఫలితాల్లో కచ్చితంగా బీఆర్ఎస్  విజయం సాధించి తీరుతుంది అన్నారు. ఈసారి అత్యధిక మెజారిటీతో ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.  88 సీట్లు వస్తాయని ముందుగా అనుకున్నామని కానీ వేర్వేరు కారణాలతో ఇప్పుడు 70కి పైగా స్థానాల్లో తమ పార్టీ విజయఢంకా మోగిస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నికలు అయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం సరికాదు అంటూ చెప్పుకొచ్చారు. పోలింగ్ కోసం వచ్చిన వారిలో ఎక్కువ మంది చేతుల్లో ఫోన్లో ఉంటాయని.. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రభావం వారిపై పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన  పూర్తి కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఆంధ్రజ్యోతి కూడా ఈ కథనాన్ని ‘ఎగ్జిట్ పోల్స్  ఓ చెత్త’ పేరుతో  ప్రచురించింది. 

ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్..

పోలింగ్ కు కొద్దిగా గంటల ముందు సాగర్ ప్రాజెక్టు దగ్గర ఏపీ పోలీసుల హల్చల్…

తెలంగాణలో గురువారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగా.. బుధవారం అర్ధరాత్రి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర హైదరాబాద్ చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీసులు ప్రాజెక్టు వద్దకు భారీగా చేరుకున్నారు.  ప్రాజెక్టు రక్షణ గేట్లు విరగొట్టారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. తెలంగాణ పోలీసులపై దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ ఆధ్వర్యంలో దాదాపుగా 700 మంది పోలీసులు ప్రాజెక్ట్ మీదికి చేరుకున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న మొత్తం 26 గేట్లలో 13 గేట్లు తమ ఆధీనంలోకి వస్తాయని చెప్పారు. తెలంగాణ పోలీసులు అక్కడికి రాకుండా ముళ్ళకంచెను అడ్డుగా వేశారు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కథనాన్ని ఈనాడు… ‘సాగర్ ప్రాజెక్టు దగ్గర ఘర్షణ’ పేరుతో ప్రచురించింది.

నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఏపీ పోలీసులు..

అవుకు రెండో టన్నులను ప్రారంభించిన వైఎస్ జగన్

గురువారం నాడు ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవుకు రెండో టన్నెల్ ను  ఘనంగా ప్రారంభించారు. దీన్ని జాతికి అంకితం చేశారు. గాలేరు- నగరిలో అంతర్భాగమైన ఈ టన్నెల్ లో నుంచి కృష్ణమ్మ  పరవళ్లు తొక్కుతూ రాయలసీమను జలసీమగా మార్చడానికి  పరుగులు పెట్టింది. ప్రస్తుత డిజైన్తో గాలేరు-నగరి వరద కాలువ ద్వారా సీమకు 20,000 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు మార్గం సుగమయింది.  టన్నెల్ ప్రారంభోత్సవం తర్వాత కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ పాయలుగా చీలి రెండు  టన్నెల్ ల ద్వారా దిగువకు ప్రవహించడాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాసేపు సంతోషంగా అలాగే చూస్తూ ఉండిపోయారు.  దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ‘సొరంగాలు దాటిన ‘కృష్ణాతరంగం’’  పేరుతో బ్యానర్ ఐటమ్ గా సాక్షి ప్రచురించింది.

సాగర్ లోని  13 గేట్లపై  మాకే అధికారం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

గురువారం నాడు నాగార్జునసాగర్ పై జరిగిన ఘర్షణను సాక్షి వేరే కోణంలో ప్రచురించింది. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని, హెడ్ రెగ్యులేటర్ సహా 13 గేట్లు రాష్ట్ర అధీనంలోకి వచ్చాయని  రాసుకొచ్చింది.  శ్రీశైలంలో 30 టీఎంసీలను అక్టోబర్ 6న కృష్ణ బోర్డు ఏపీకి కేటాయించిందని.. అందులో 15 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సాగర్ కు తరలించిందని  చెప్పుకొచ్చింది. ఆ నీటిని విడుదల చేయాలన్న ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని తెలంగాణ తోసి పుచ్చిందని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చెప్పుకొచ్చారు.   ఆంధ్రప్రదేశ్లోని భూభాగంలో ఉన్న సాగర్ స్పిల్ వే 13 గేట్లతో పాటు కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ ను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను దిహానిర్దేశం చేశారని, ఏపీకి కేటాయించిన నీటిని  విడుదల చేయాలని కూడా ఆదేశించారని.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అధికారులు వాటిని తమధీనంలోకి తీసుకున్నారని పూర్తి కథనాన్ని సాక్షి ప్రముఖంగా ‘సాగర్ లో సగం ఏపీ స్వాధీనం’ అనే పేరుతో  ప్రముఖంగా ప్రచురించింది. 

నాగార్జున సాగ‌ర్ వివాదం.. అంబ‌టి రాంబాబు సంచ‌లన‌ వ్యాఖ్య‌లు

కర్ణాటకకు  కాంగ్రెస్ అభ్యర్థులు…!

తెలంగాణలో 70కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాలో ఉంది కాంగ్రెస్. అయితే..ఒకవేళ హంగ్ వస్తే పరిస్థితి ఏమిటి అనే దానిపై కసరత్తు చేస్తుంది. దీంతో  గెలవబోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పైన దృష్టి సారించింది. గెలుపుకు దగ్గరలో ఉన్న అభ్యర్థులను ప్రత్యేక విమానాల్లో బెంగళూరుకు తరలించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీ నాయకత్వం అభ్యర్థులను అప్రమత్తం చేసినట్లు, ఏ సమయంలోనైనా బెంగుళూరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపినట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో అయితే.. ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లొంగకుండా, పార్టీ ఫిరాయింపులు జరగకుండా ఉంటుందని భావిస్తుంది.  భావిస్తోంది ఈ క్యాంపు ఆపరేషన్కు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వం వహించనున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన ఆసక్తికర కథనాన్ని ‘కాంగ్రెస్ అభ్యర్థులు క్యాంపులకు’ అనే పేరుతో కథనాన్ని ప్రచురించింది ఆంధ్రజ్యోతి.

భారత మిలటరీకి మరిన్ని యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు

భారతరక్షణ ఉత్పత్తులను దేశీయంగా తయారీ, అభివృద్ధి చేసేలా  గురువారం రక్షణశాఖ ప్రాథమికంగా రూ. 2.23 లక్షల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. దీంతో భారత మిలటరీకి మరిన్ని హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు సమకూరలు ఉన్నాయి. 150 ప్రచండ యుద్ధ హెలికాప్టర్లు,  97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సారధ్యంలోని రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి అంగీకారం తెలిపింది. ఈ రెండింటి ఒప్పందం విలువ రూ.1.10 లక్షల కోట్లు. దీని ప్రకారం తేజస్ మార్క్ వన్ యుద్ధ విమానాలు వైమానిక దళానికి, హెలికాప్టర్లు వైమానికాల దళంతో పాటు ఆర్మీకి కూడా కేటాయించబోతున్నారు. వీటన్నింటితో పాటు మరిన్ని ప్రాజెక్టులకు కూడా డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో ప్రచురించింది.

పోలింగ్ కేంద్రాల్లో గులాబీ కండువాతో నేతలు..

తెలంగాణలో ఎన్నికలవేళ అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పోలింగ్ నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలు అక్కడక్కడ చోటుచేసుకున్నాయి.  పార్టీ కండువాతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. హుజూర్నగర్ లో  ఎమ్మెల్యే సైదిరెడ్డి,  బెల్లంపల్లిలో టిఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యలు  గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఇక ఓటు వేసిన తర్వాత టిఆర్ఎస్ కి ఓటు వేయాలంటూ చెప్పిందని ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు  చేశారు కాంగ్రెస్ నేతలు. ఆమెపై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసు  పెట్టారు.  దీనికి సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది
గులాబీ కండువాతో పోలింగ్‌ కేంద్రానికి,,,

 

Follow Us:
Download App:
  • android
  • ios