Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వివాదం.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. నాగార్జునసాగర్ 13 గేట్లు స్వాధీనం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ అధికారులు సాగర్ కుడికాలువ నుంచి నీరు విడుదలకు ప్రయత్నిస్తున్నారు.
Nagarjuna Sagar controversy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే, నది జలాలు, విద్యుత్ పంపిణీ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ లోకి అక్రమంగా ప్రవేశించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఏపీ పోలీసులు నీటి విడుదలకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా అంబటి స్పందిస్తూ.. "త్రాగు నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ రైట్ కెనాల్ కి నేడు నీరు విడుదల చేయనున్నాము అని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు ఉన్న తరుణంలో మంత్రి కామెంట్స్ పరిస్థితులను దారణంగా మార్చే విధంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.
కాగా, బుధవారం అర్ధరాత్రి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఈ అక్రమ చోరబాటును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని 13 గేట్లను తమ అధినంలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు నీటి విడుదల చేయడానికి ప్రయత్నించారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ అధికారులు ఏపీ అధికారులకు షాక్ ఇచ్చారు. నీటి విడుదల చేయడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించడంతో.. వెంటనే తెలంగాణ అధికారులు కరెంట్ సరఫరాను కట్ చేశాడు. మోటర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నీటి విడుదలకు బ్రేక్ పడింది.