Asianet News TeluguAsianet News Telugu

Telangana Exit polls 2023: తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా

మెజారిటీ ఎగ్జిట్ పోల్స్  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే అధిక స్థానాలు  దక్కే అవకాశం ఉందని  తేల్చి చెప్పాయి.  కాంగ్రెస్ పార్టీ  60కిపైగా స్థానాలను దక్కించుకొంటుందని పలు సంస్థలు ప్రకటించాయి.
 

Majority Exit polls predicted Congress to Get  largest  Seats in Telangana lns
Author
First Published Nov 30, 2023, 7:27 PM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకోనుందని  పలు సర్వే సంస్థలు  తెలిపాయి. పలు సర్వే సంస్థలు  గురువారంనాడు  ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో  కాంగ్రెస్ పార్టీ అధిక  స్థానాలను దక్కించుకుంటుందని  ఈ సంస్థలు తెలిపాయి. 

ఆరా సంస్థ ఎగ్జిట్ సర్వే  ఫలితాలు

బీఆర్ఎస్  41 -49 
కాంగ్రెస్  58 - 63 
బీజేపీ  5 - 7 
ఇతరులు  7 - 9 స్థానాలను దక్కించుకుంటాయని  ఆ సంస్థ తెలిపింది. బీజేపీ కంటే  ఇతరులే  ఏడు నుండి 9 స్థానాలు దక్కించుకుంటాయని ఈ సంస్థ వివరించింది.  బీజేపీకి  5 నుండి ఏడు స్థానాలు దక్కుతాయని తెలిపింది.

తెలంగాణలో సీ ప్యాక్  ఎగ్జిట్ పోల్స్ కూడ  కాంగ్రెస్ కు అనుకూలంగా  ఉన్నాయి.

సీ ప్యాక్  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు


కాంగ్రెస్ -65
బీఆర్ఎస్ -41
బీజేపీ- 4
ఎంఐఎం -7 స్థానాలను దక్కించుకోనున్నట్టుగా తెలిపింది.  బీజేపీకి ప్రస్తుతం ఉన్న మూడు స్థానాలకు అదనంగా మరో సీటు దక్కనుందని ఈ సంస్థ ప్రకటించింది.

జన్ కీ బాత్ సర్వే ఫలితాలు కూడ కాంగ్రెస్ కు అధిక స్థానాలు వస్తాయని తెలిపింది.

కాంగ్రెస్ 48-64
బీఆర్ఎస్ 40-55
బీజేపీ 7 -13
ఎంఐఎం 4-7 స్థానాలు దక్కించుకుంటుందని  జన్ కీ బాత్ సర్వే తెలిపింది.  అయితే  ఈ సర్వే మేరకు  బీజేపీ కింగ్ మేకర్ పాత్ర ను పోషించే అవకాశం ఉంది.  

సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ సర్వే  కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ  మెజారిటీ స్థానాలను దక్కించుకుంటుందని  ఈ సర్వే తేల్చింది.   

కాంగ్రెస్ 56
బీఆర్ఎస్ 48
బీజేపీ 10
ఎంఐఎం 5

సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉందని తెలిపింది. అయితే  బీజేపీ  10 స్థానాలతో కింగ్ మేకర్ పాత్రను పోషించే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రకటించింది.

తెలంగాణలో పీపుల్స్ పల్స్ సంస్థ కూడ  కాంగ్రెస్ దే  పైచేయి అని ప్రకటించింది.


కాంగ్రెస్ 62-72
బీఆర్ఎస్ 35-46
బీజేపీ 03-08
ఎంఐఎం 06-07
ఇతరులు 01-02  స్థానాలను కైవసం చేసుకొంటారని పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకటించింది.

రేస్ సంస్థ ఎగ్జిట్ పోల్  కూడ  కాంగ్రెస్  అధిక స్థానాలు దక్కించుకుంటుందని  తెలిపింది. 


రేస్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది. బీఆర్ఎస్‌కు 48 + or -3 , కాంగ్రెస్‌కు 62 + or -5, బీజేపీకి + or -2, ఎంఐఎం 6 + or - 1, ఇతరులు 1 + or -2 స్థానాలు కైవసం చేసుకుంటారని రేస్ సంస్థ అంచనా వేసింది. 


తెలంగాణలో కాంగ్రెస్  పార్టీకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని   పోల్ టెండ్ర్స్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. 
కాంగ్రెస్ కు 65-68
బీఆర్ఎస్ 35-40
బీజేపీ 7-10
ఇతరులకు 6-9
స్థానాలు దక్కే అవకాశం ఉందని  సర్వే తెలిపింది. 


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 67 నుండి  78 స్థానాలను కైవసం చేసుకుంటుందని చాణక్య  సర్వే సంస్థ  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.

కాంగ్రెస్ 67-78
బీఆర్ఎస్  22-31
బీజేపీ 6-9
ఎంఐఎం 6-7 స్థానాలను దక్కించుకొనే అవకాశం ఉందని  చాణక్య సర్వే సంస్థ తెలిపింది.

also read:Telangana Exit Poll Result 2023: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్‌ లో కాంగ్రెస్ కు 72 స్థానాలు

అయితే ఎగ్జిట్ సర్వే ఫలితాలను  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కొట్టిపారేశారు.  గతంలో కూడ  బీఆర్ఎస్ ఓటమి పాలౌతుందని సర్వే సంస్థలు ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. 70కి పైగా సీట్లతో అధికారాన్ని దక్కించుకుంటామని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.  ఇదిలా ఉంటే  ఇవాళ పలు సర్వే సంస్థలు  ప్రకటించిన  ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ ఆ సర్వే సంస్థలకు క్షమాపణలు చెబుతారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios