ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించాడు... ఆ యువతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తానని ప్రియుడు బెదిరించాడు.
హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించాడు... ఆ యువతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తానని ప్రియుడు బెదిరించాడు. ప్రియురాలి తండ్రిని రూ. 5కోట్లు కావాలని బెదిరించిన నిందితుడు వినీష్ అతడి ఇద్దరు మిత్రులను సీసీఎస్ పోలీసులు సీనీ ఫక్కిలో వెంటాడి పట్టుకొన్నారు.
హైద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురుతో వినీష్ ప్రేమించానని నమ్మించాడు. ఆ యువకుడితో ఆమె సన్నిహితంగా ఉండేలా చేసుకొన్నాడు. ఆమె తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను భద్రపర్చుకొన్నాడు.
అయితే ప్రేమ పేరుతో ఆ యువతిని మోసం చేశాడు. యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్‌లో ఫోటోలు పెడతానని బెదిరించాడు. అంతేకాదు ప్రియురాలి తండ్రి పెద్ద వ్యాపారవేత్త.. అతడికి ఫోన్ చేసి రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
లేకపోతే నీ కూతురు ఫోటోలను ఫోర్న్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై నిందితుడు వీనీష్‌తో ప్రియురాలి తండ్రి రూ కోటి ఒప్పందం కుదుర్చుకొన్నాడు.ప్రియుడితో ఆ యువతి సన్నిహితంగా ఐదు ఫోటోలు దిగింది.ఈ ఐదు ఫోటోలను చూపి వీనీష్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు.
సినిమాల్లో చూపించినట్టుగా కోటి రూపాయాలను ప్రియురాలి తండ్రి నుండి వసూలు చేసుకోవాలని వీనీష్ ప్లాన్ చేసుకొన్నాడు. అయితే ఈ విషయాన్ని ప్రియురాలి తండ్రి పోలీసులకు చెప్పాడు.
ప్రియురాలి తండ్రి ఒప్పందంలో భాగంగా కోటి రూపాయాల్లో తొలుత రూ.25 లక్షలు చెల్లిస్తానని వీనీష్ ను నమ్మించారు. ఈ రూ25 లక్షలను తీసుకొనేందుకు వీనీష్ అతని ఇద్దరు స్నేహితులు వచ్చారు. అయితే వీనీష్ అతని ఇద్దరు స్నేహితులు వ్యాపారవేత్త నుండి రూ. 25 లక్షలు తీసుకొన్న తర్వాత సీసీఎస్ పోలీసులు వీనీష్ ను పట్టుకొనేందుకు ప్రయత్నించారు.
అయితే వీనీష్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులు కూడ హైద్రాబాద్ నుండి కామారెడ్డి వరకు వెళ్లారు. పోలీసులు వారిని కామారెడ్డి వరకు వెంటాడి పట్టుకొన్నారు. నిందితుల నుండి రూ. 25 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు.
వీనీష్ ప్లాన్ ఇదీ
వీనీష్ ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వీనీష్ చదువుతున్న కాలేజీలోనే ఆ యువతి అదే కాలేజీలోనే చదువుతోంది. ఆ యువతిని ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తే తనకు డబ్బులు వస్తాయని వీనీష్ భావించాడు. బాధితురాలితో ప్రేమించినట్టు నటించి ఆ యువతితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా ఐదు ఫోటోలను తీసుకొన్నాడు.
ఈ ఫోటోలను ఫోర్న్‌సైట్లలో అప్ లోడ్ చేస్తానని నిందితుడు ప్రియురాలి తండ్రిని బెదిరించాడు. అయితే ఈ విషయమై నిందితుడిని నమ్మించిన ప్రియురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిందితుడితో పాటు అతడికి సహకరించిన ఇద్దరు మిత్రులను వెంటాడి పట్టుకొన్నారు.
ఈ వార్తలు చదవండి
76 ఏళ్ల వయస్సులో చిన్నారులపై లైంగిక వేధింపులు: రాత్రి గదిలో ఇలా...
అఫైర్: పెళ్లయ్యాక ప్రియుడితో జంప్, వద్దన్న భర్తకు షాక్
వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తకు షాకిచ్చిన భార్య
