MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Automobile
  • E-Cycle : ఏడాది పెట్రోల్ ఖర్చులో ఇ-బైక్ .. రూ.50 వేలలోపు ధరలో వచ్చేవి ఇవే

E-Cycle : ఏడాది పెట్రోల్ ఖర్చులో ఇ-బైక్ .. రూ.50 వేలలోపు ధరలో వచ్చేవి ఇవే

రోజూ మీ ప్రయాణానికి లీటర్ పెట్రోల్ అవసరం అయితే ఏడాదికి రూ.30 నుండి రూ.40 వేల ఖర్చు. ఈ డబ్బులతోనే ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేయవచ్చు. డబ్బులు ఆదా చేస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 17 2026, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇ బైక్స్ కు పెరుగుతున్న డిమాండ్...
Image Credit : hero lectro website

ఇ-బైక్స్ కు పెరుగుతున్న డిమాండ్...

మిడిల్ ఈస్ట్ లో యుద్దవాతావరణం నేపథ్యంలో ఇండియాలో వంటగ్యాస్ (LPG) కొరత ఏర్పడింది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో అనేక హోటల్స్, రెస్టారెట్లు మూతపడ్డాయి... కొన్ని కట్టెలపొయ్యి ఉపయోగిస్తున్నాయి. గృహ అవసరాలకోసం ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో ప్రజలు ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్లను సిద్దం చేసుకుంటున్నారు.

ఎల్పిజి కొరత ఉన్నా ఎలాగోలా మేనేజ్ చేయవచ్చు. అదే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే..? ధరలు బాగా పెరిగితే..? దేశ ప్రజలు మరింతగా ఇబ్బందిపడతారు. ఈ క్రమంలో వ్యక్తిగత పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయమే ఎలక్ట్రిక్ సైకిళ్లు. వీటితో పెట్రోల్ కష్టాలనుండి బయటపడేయడమే కాదు డబ్బులు ఆదా చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి తక్కువ ధరలో మంచి రేంజ్ (మైలేజ్) కలిగిన ఎలక్ట్రిక్ సైకిల్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో కేవలం రూ.50,000 లోపు ధరకు కూడా కొన్ని ఇ-బైక్స్ లభిస్తున్నారు. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలో మీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించవచ్చు. దీంతో ఖర్చు తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇ-బైక్స్ అంటే ఏంటి?
Image Credit : bsa website

ఇ-బైక్స్ అంటే ఏంటి?

పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను వెతకడం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా రోజూ తక్కువ దూరాలు ప్రయాణం సాగించాలనుకునేవాళ్లు ఎలక్ట్రిక్ సైకిళ్ల (ఇ-బైక్స్) వైపు చూస్తున్నారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులే కాదు చిరు వ్యాపారులు కూడా ఉన్నారు.

ఇ-బైక్స్ అంటే సాధారణ సైకిళ్లు కావు. వీటిలో ఉండే ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ సాయంతో మీరు పెద్దగా కష్టపడకుండానే ప్రయాణించవచ్చు. అంటే పెడల్ తొక్కడం చాలా సులభం అన్నమాట. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 నుంచి 60 కిలోమీటర్ల వరకు వెళ్లే సామర్థ్యం ఉండటంతో, రోజువారీ ప్రయాణాలకు ఇవి బెస్ట్ ఆప్షన్‌గా మారాయి.

Related Articles

Related image1
Hero Electric Cycle: స్కూటర్ కంటే ఈ సైకిల్ బెస్ట్ కదా.. ఒక్క ఛార్జ్‌తో 70 కి.మీ ప్రయాణం
Related image2
Electric cycle: రూ. 5 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. పతంజలి మరో సంచలనం.?
35
తక్కువ ధరలో బెస్ట్ ఇ-బైక్ మోడల్స్
Image Credit : ecobike website

తక్కువ ధరలో బెస్ట్ ఇ-బైక్ మోడల్స్

మార్కెట్లో రూ.50,000 లోపు ధరలో చాలా మంచి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. EMotorad T-Rex Air, BSA Urban Ranger వంటి మోడల్స్ మంచి రేంజ్‌తో పాటు స్టైలిష్ డిజైన్‌తో వస్తున్నాయి. Eco-Bike Red వంటివి తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను అందిస్తున్నాయి. అలాగే Hero Lectro Y3, Y5 వంటి మోడల్స్ నమ్మకానికి, తక్కువ మెయింటెనెన్స్‌కు పెట్టింది పేరు.

45
అద్భుతమైన ఫీచర్లు
Image Credit : e motorad website

అద్భుతమైన ఫీచర్లు

ఈ మోడల్స్‌లో చాలా వాటికి రిమూవబుల్ బ్యాటరీ, ఎల్ఈడీ డిస్‌ప్లే, డిస్క్ బ్రేకులు, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొన్ని మోడల్స్ పెడల్ అసిస్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తాయి. దీనివల్ల సైకిల్ తొక్కుతున్నప్పుడు బ్యాటరీ సాయం అందుతుంది. ఇది ప్రయాణాన్ని మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారుస్తుంది.

55
ఖర్చు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ
Image Credit : Freepik

ఖర్చు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ

మొత్తం మీద చూస్తే ఇ-బైక్స్‌ను తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణానికి మేలు చేసే ఒక రోడ్‌సైడ్ విప్లవంగా చెప్పొచ్చు. పెట్రోల్ గురించి చింత లేకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, రోజువారీ జీవితాన్ని సులభతరం చేసే ఈ మార్పును స్వీకరించాల్సిన సమయం వచ్చేసింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
భారత దేశం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kia Car Offers : కియా కార్లపై ఫెస్టివల్ ఆఫర్.. ఏకంగా రూ.1.5 లక్షల భారీ డిస్కౌంట్
Recommended image2
Maruti Baleno : మీదగ్గర కేవలం రూ.11,000 ఉంటే చాలు.. సరికొత్త మారుతి బాలెనో కారు సొంతం చేసుకొండి
Recommended image3
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Related Stories
Recommended image1
Hero Electric Cycle: స్కూటర్ కంటే ఈ సైకిల్ బెస్ట్ కదా.. ఒక్క ఛార్జ్‌తో 70 కి.మీ ప్రయాణం
Recommended image2
Electric cycle: రూ. 5 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. పతంజలి మరో సంచలనం.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved