అదానీపై విమర్శలు చేసినోళ్లే.. ఇప్పుడు ఒప్పందాలు చేసుకుంటున్నారు - బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఢిల్లీ కాంగ్రెస్ (delhi congress) అదానీ (adani)తో పోరాడుతోందని, కానీ తెలంగాణ కాంగ్రెస్ (telangana congress)మాత్రం ఆయనతో కలిసి పని చేస్తోందని బీజేపీ (BJP)నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar)అన్నారు. అసలు అదానీపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Those who criticized Adani.. are now making deals - BJP leader NVSS Prabhakar..ISR

NVSS Prabhakar  : అదానీ గ్రూప్స్ చైర్మన్ గౌతమి అదానీ పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. ఎన్నికలకు ముందు అదానీని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు దావోస్ లో ఆయనతో కుమ్మక్కయ్యారని ఆరోపించింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

హైదరాబాద్ అమ్మాయికి ఇంటర్నేషనల్ టైటిల్.. డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టీలో ఆకుల శ్రీజ విజయం..

గతంలో అదానీపై విమర్శలు చేసిన వాళ్లే.. ఇప్పుడు ఆయనతో ఒప్పందాలు చేసుకుంటున్నారని అన్నారు. అదానీపై రేవంత్ రెడ్డి గతంలో తీవ్ర విమర్శలు చేశారని, ఆయనను పేరు పెట్టి కూడా పిలిచారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ కంపెనీలతో చేతులు కలిపారని మండిపడ్డారు. దావోస్ లో అదానీ గ్రూప్ తో రాష్ట్రంలోకి రూ.12,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నాలుగు ఎంవోయూలు కుదుర్చుకుందని చెప్పారు. 

దుర్మార్గుడు.. ఎద్దుతో బతికున్న కోడిని బలవంతంగా తినిపించిన యూట్యూబర్.. వైరల్..

ఇప్పటికైనా అదానీపై తమ పార్టీ వైఖరి ఏంటో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివరించాల్సిన అవసరం ఉందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలో అదానీతో కాంగ్రెస్ పోరాడుతోందని, తెలంగాణలో కలిసి పనిచేస్తుందని విమర్శించారు. ఇది పూర్తిగా అవకాశవాద రాజకీయమని అన్నారు. గతంలో దావోస్ లో జరిగిన ఎకనామిక్ ఫోరం సమావేశంలో కుదుర్చుకున్న ఎంవోయూలన్నీ కార్యరూపం దాల్చలేదని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో రూ.21 వేల కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నారని, అవన్నీ ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘నేను చిన్నప్పుడు ఇలాంటి ఇంట్లో ఉండి ఉంటే’’- స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ.. వైరల్

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠా కార్యక్రమం కోసం యావత్ భారత దేశం దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోందని ప్రభాకర్ అన్నారు. జనవరి 22ను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయడం వల్ల ప్రజలు ఆ రోజున నిర్వహించే వివిధ ఆచారాలను వీక్షించవచ్చని ఆయన తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios