హైదరాబాద్ అమ్మాయికి ఇంటర్నేషనల్ టైటిల్.. డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టీలో ఆకుల శ్రీజ విజయం..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చెందిన ఆకుల శ్రీజ (Akula Sreeja) డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టీ 2024 (WTT Feeder Corpus Christi -2024) మహిళల సింగిల్స్ (women’s singles)ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించింది. ఇప్పటికే రెండు సార్లు నేషనల్ చాంపియన్ గా నిలిచిన ఆమె.. తాజా విజయంతో తన కెరీర్ లో తొలి సారి ఇంటర్ నేషనల్ టైటిల్ ను సొంతం చేసుకుంది (Akula Sreeja win WTT Feeder Corpus Christi maiden internationa title).
హైదరాబాద్ అమ్మాయి ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంది. శుక్రవారం జరిగిన డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టీ 2024 మహిళల సింగిల్స్ ఫైనల్ లో భాగ్యనగరానికి చెందిన ఆకుల శ్రీజ ప్రపంచ 46వ ర్యాంకర్ లిల్లీ జాంగ్ (అమెరికా)పై 11-6, 18-16, 11-5 తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే రెండుసార్లు నేషనల్ ఛాంపియన్ షిప్ లను గెలుచుకున్న ఆమె.. తొలిసారిగా ఇంటర్నేషనల్ టైటిల్ ను సొంతం చేసుకుంది.
‘‘నేను చిన్నప్పుడు ఇలాంటి ఇంట్లో ఉండి ఉంటే’’- స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ.. వైరల్
ప్రపంచంలో 94వ ర్యాంక్ లో ఉన్న 25 ఏళ్ల శ్రీజ.. ఫైనల్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ప్రపంచ 37వ ర్యాంకర్ జాంగ్ ను వెనక్కి నెట్టి స్కోరును సమం చేసింది. ఫైనల్లో చివరి కొన్ని పాయింట్లను కైవసం చేసుకోవడం ద్వారా శ్రీజ ఆమెను అధిగమించింది. సెమీ ఫైనల్ లో చైనా సంతతికి చెందిన మరో అమెరికా ఆటగాడు జియాంగ్షాన్ గావోతో తలపడి 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
1-2తో వెనుకబడిన ఈ అమెరికా ఆటగాడు చక్కటి ఆటతీరుతో నాలుగో గేమ్ లో స్కోరును 12-10తో సమం చేశాడు. ఆ తర్వాత ఐదో గేమ్ ను 9-11, 11-5, 11-6, 10-12, 11-9 తేడాతో గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లింది. కాగా.. ఈ విజయంపై ఆమె స్పందించింది. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన ప్రయత్నాలు కోరుకున్న చోటికి తీసుకొచ్చాయి. ఇది నా మొదటి ఇంటర్నేషనల్ టైటిల్. టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ లో రెండు క్లోజ్ కాల్స్ తర్వాత నేను దీనిని సాధించాను. ఇద్దరూ (అమీ, లిల్లీ) టాప్ ర్యాంక్ ప్లేయర్లు, వారితో బాగా ఆడాను’’ మ్యాచ్ అనంతరం ఆమె ‘స్పోర్ట్స్ స్టార్ కు తెలిపారు.
దుర్మార్గుడు.. ఎద్దుతో బతికున్న కోడిని బలవంతంగా తినిపించిన యూట్యూబర్.. వైరల్..
ఈ విజయం భారత మహిళల జట్టు 2024 ఒలింపిక్స్ కు అర్హత సాధించడానికి, అలాగే సింగిల్స్ ఈవెంట్ కు అర్హత సాధించడానికి కూడా సహాయపడుతుందని శ్రీజ అన్నారు. ఈ టైటిల్ భవిష్యత్తుపై తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, పారిస్ ఒలింపిక్స్ తో పాటు రాబోయే అన్ని టోర్నమెంట్ లకు సన్నద్ధం అయ్యేందుకు తెలంగాణ కొత్త ప్రభుత్వం తనకు సహకరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.